- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
UP: కుమార్తె మామతో పారిపోయిన మహిళ
ఉత్తరప్రదేశ్ లో కాబోయే అల్లుడితో అత్త పారిపోయిన సంగతి మరువకముందే ఇలాంటి ఘటనే మరోటి వెలుగులోకి వచ్చింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ లో కాబోయే అల్లుడితో అత్త పారిపోయిన సంగతి మరువకముందే ఇలాంటి ఘటనే మరోటి వెలుగులోకి వచ్చింది. పిల్లనిచ్చిన మామతో ఓ మహిళ పారిపోయింది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని బదౌల్ సమీపంలో డేటా గంజ్ కొత్వాల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ ప్రాంతానికి చెందిన సునీల్, మమత దంపతులు, వీరిగి నలుగురు పిల్లలు కాగా.. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. అయితే 2022లో మీరు పెద్ద కుమార్తెను బాదం సదర్ కొత్వాలు ప్రాంతానికి చెందిన శైలేంద్ర కుమారుడికి ఇచ్చి వివాహం జరిపించారు. కూతుర్ని పెళ్లి అయిన తర్వాత అసలు కథ ప్రారంభమైంది. అల్లుడి తండ్రితో ప్రేమలో పడింది. ఇక్కడి నుంచి వారి వ్యవహారం కొనసాగింది. మహిళ భర్త ట్రక్కు డ్రైవర్ గా పని చేస్తుండడంతో చాలా కాలం పాటు ఇంటికి దూరంగా ఉంటాడు. భర్త లేని సమయంలో శైలేంద్ర కుమార్ తో మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ వ్యవహారం ఇలా సాగుతుండగా.. ఇద్దరూ కలిసి ఓ రోజు ఇంటి నుంచి పారిపోయారు. మహిళ ఇంట్లో నుంచి పారిపోతూ.. నగదును, నగలను ఎత్తుకొని వెళ్ళిపోయింది. ఈ ఘటనపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు అందిన విషయాన్ని దాతాగంజ్ సర్కిల్ ఆఫీసర్ కెకె తివారీ ధ్రువీకరించారు. "ఒక మహిళ తన కూతురి మామతో వెళ్లిందని పేర్కొంటూ ఫిర్యాదు అందిందన్నారు. దీనిపైన దర్యాప్తు కొనసాగుతోందన్నారు.






