- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Modi: మదర్ ఆఫ్ ఆల్ డీల్స్.. ఇండియా-ఈయూ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‍పై ప్రధాని మోడీ
భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందంతో ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: త్వరలో ప్రపంచంలోనే భారత దేశం అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రంగా అవతరించబోతున్నదని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ దశాబ్దం చివరి నాటికి చమురు, గ్యాస్ రంగంలో 100 బిలియన డాలర్ల పెట్టుబడే లక్ష్యం అని చెప్పారు. ఇవాళ ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమంలో మాట్లాడారు. భారత్- ఈయూ వాణిజ్య ఒప్పందంతో తయారీ రంగంలో వృద్ధి సాధిస్తామని తెలిపారు. ఇటీవల సంతకాలు జరిగిన ఇండియా-ఈయూ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‍ను మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా పీఎం అభివర్ణించారు. ఈ ఒప్పందం ప్రపంచంలోని రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య భాగస్వామ్యానికి ఒక చక్కటి ఉదాహరణ అన్నారు. ఈ డీల్ తో రెండు ప్రాంతాలలోని ప్రజలు, వ్యాపారాలు, పెట్టుబడిదారులకు అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ వాణిజ్య ఒప్పందం దేశంలో తయారీ మరియు సేవలు రెండింటిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ఆయన అన్నారు. చమురు మరియు గ్యాస్ రంగంలో పెట్టుబడులను పెంచడానికి భారతదేశం ప్రయత్నాలు చేస్తోందని ప్రధానమంత్రి అన్నారు.






