- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Crime News : కన్నతల్లి కర్కశం.. పిల్లలను చంపి ప్రియునితో హనీమూన్
యూపీ(UP)లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : యూపీ(UP)లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియునితో హనీమూన్ కు వెళ్లేందుకు ముక్కు పచ్చలరాని కన్నబిడ్డలనే చంపేసింది ఓ తల్లి. ఈ ఘటన వివరాల్లోకి వెళితే యూపీలోని ముజఫర్ నగర్(Mujafar Nagar) లో రోడ్కలి అనే గ్రామంలో ముస్కాన్ అనే మహిళకు వసీంతో వివాహం జరిగింది. వారికి అర్హన్(5), ఎన్యా(1) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉద్యోగరీత్యా వసీం చండీఘడ్ లో ఉంటూ అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ముస్కాన్ అదే గ్రామానికి చెందిన జునైద్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
అయితే ప్రియునితో హనీమూన్ కి వెళ్ళడానికి పిల్లలు అడ్డుగా ఉన్నారని భావించి వారికి విషం పెట్టి చంపేసి, హనీమూన్ కు వెళ్లేందుకు సిద్ధం అయింది. అయితే ఇంట్లో పిల్లలు ఇద్దరు అనుమానస్పదంగా మృతి చెంది ఉండటంతో పోలీసులు తల్లిని కస్టడీలోకి తీసుకొని విచారించగా.. ప్రియుని సహాయంతో తానే పిల్లలను హత్య చేసిందని ఒప్పుకుంది. దీంతో ముస్కాన్ ను అదుపులోకి తీసుకొని, జునైద్ కోసం గాలిస్తున్నారు. కాగా యూపీలో సంచలనం రేపిన ఈ ఘటనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మతనానికే మాయని మచ్చ అంటూ నెటిజన్స్ కూడా మండిపడుతున్నారు.






