కోడలి జీతం నుంచి మామకు ప్రతి నెల పరిహారం.. హైకోర్టు సంచలన తీర్పు

by Prasad Jukanti |

కోడుకు ఉద్యోగం తీసుకున్న కోడలు తమను పట్టించుకోవడం లేదంటూ ఓ మామ కోర్టును ఆశ్రయించాడు.

కోడలి జీతం నుంచి మామకు ప్రతి నెల పరిహారం.. హైకోర్టు సంచలన తీర్పు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భర్త మరణంతో కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం పొందిన మహిళకు కోర్టు షాకిచ్చింది. అత్తింటివారి పోషణను పట్టించుకకోపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. కోడలి తీరుపై మామ కోర్టును ఆశ్రయించగా సుదీర్ఘ కాలం విచారణ అనంతరం రాజస్థాన్ హైకోర్టు (Rajasthan High Court) సంచలన నిర్ణయం వెలువరించింది. రాజస్థాన్ లోని అల్వార్ లోని ఖేర్లీకి చెందిన భగవాన్ సింగ్ కుమారుడు రాజేశ్ కుమార్ అజీర్మ్ డిస్కామ్ లో టెక్నికల్ అసిస్టెంట్ గా పని చేసేవారు. 15 సెప్టెంబర్ 2015న సర్వీస్ లో ఉండగా రాజేశ్ కుమార్ మరణించారు. ఆ తర్వాత అత్తమామలను పోషిస్తాననే షరతుతో రాజేశ్ ఉద్యోగం కారుణ్య నియామకం కింద ఆయన భార్య శశికుమారికి ఇచ్చారు. 2016లో ఆమె ఎల్‍డీసీ పోస్టుకు నియామకం అయింది. ఆ తర్వాత శశికుమారి తన అత్తామామల పోషణను పట్టించుకోలేదు. దాంతో 2017లో భగవాన్ సింగ్ తన కోడలి తీరుపై సంబంధింత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో 2018లో భగవాన్ సింగ్ రాజస్తాన్ హైకర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ కాలం విచారణ జరిగిన ఈ కేసులో తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది. కోడలి జీతం నుంచి ఇకపై ప్రతి నెల రూ. 20 వేల మామకు పరిహారంగా ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది.

Next Story