సంచలనం సృష్టించిన తల్లీకుమార్తెలపై అత్యాచార ఘటన.. తొమ్మిదేళ్ల తర్వాత తుది తీర్పు

by Ramesh Naini |

2016లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బులంద్‌షహర్‌ ఎన్‌హెచ్‌–91 గ్యాంగ్‌ రేప్‌ కేసులో సొమవారం న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది.

సంచలనం సృష్టించిన తల్లీకుమార్తెలపై అత్యాచార ఘటన.. తొమ్మిదేళ్ల తర్వాత తుది తీర్పు
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Bulandshahr gang rape case) 2016లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బులంద్‌షహర్‌ ఎన్‌హెచ్‌–91 గ్యాంగ్‌ రేప్‌ కేసులో సొమవారం న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. తల్లీకుమార్తెలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఐదుగురు నిందితులకు జీవిత ఖైదు విధించింది. ఈ ఘటన 2016 జూలై 29న జరిగింది. నోయిడా నుంచి షాజహాన్‌పూర్‌కు కారులో వెళ్తున్న ఐదుగురు సభ్యుల కుటుంబాన్ని బులంద్‌షహర్‌ కోత్వాలి దేహాత్‌ పరిధిలోని దోస్త్‌పూర్‌ గ్రామం సమీపంలో దుండగులు అడ్డుకున్నారు. రహదారిపై ఇనుప రాడ్‌ పెట్టి కారును ఆపించిన నిందితులు, కుటుంబాన్ని బలవంతంగా బయటకు లాగి సమీప పొలాలకు తీసుకెళ్లారు. అక్కడ తల్లి, కుమార్తెపై అమానుషంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మిగతా కుటుంబ సభ్యులను బెదిరించి కట్టిపడేశారు.

తీర్పు అనంతరం అదనపు జిల్లా ప్రభుత్వ న్యాయవాది వరుణ్‌ కౌశిక్‌ మాట్లాడుతూ.. ఈ తీర్పు సమాజానికి బలమైన సందేశమని పేర్కొన్నారు. ఇలాంటి ఘోర నేరాలకు పాల్పడే వారిని సమాజం నుంచి దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం స్పష్టం చేసిందన్నారు. ఐదుగురు నిందితులకు జీవిత ఖైదు విధించడం ద్వారా న్యాయం జరిగిందని అన్నారు. ఈ కేసులో ఫోరెన్సిక్‌ ఆధారాలు కీలకంగా మారాయని, బాధిత తల్లి దుస్తులపై లభించిన డీఎన్‌ఏ నమూనాలు నిందితుల్లో ఒకరితో సరిపోవడం వల్ల అభియోగాలు బలపడ్డాయని కౌశిక్‌ వెల్లడించారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురిపై చార్జిషీట్‌ దాఖలైనప్పటికీ, విచారణ సమయంలో 2019లో ఒక నిందితుడు జైల్లో మృతి చెందాడు. మిగిలిన ఐదుగురిపై కొనసాగిన విచారణలో తాజాగా కోర్టు తుది తీర్పు వెల్లడించింది. వీడియో

Next Story