- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > Gujarat: తీవ్ర విషాదకర ఘటన.. నలుగురు పిల్లలతో సహా బావి దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి
Gujarat: తీవ్ర విషాదకర ఘటన.. నలుగురు పిల్లలతో సహా బావి దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి
by Yella Dhawani Reddy |
గుజరాత్ (Gujarat) రాష్ట్రంలో శుక్రవారం హృదయవిదారకమైన ఘటన వెలుగుచూసింది.

X
దిశ, వెబ్ డెస్క్: గుజరాత్ (Gujarat) రాష్ట్రంలో శుక్రవారం హృదయవిదారకమైన ఘటన వెలుగుచూసింది.జామ్‌నగర్ (Jamnagar) జిల్లాలోని సుమ్రా గ్రామానికి చెందిన భానుబెన్ తోరియా అనే వివాహిత.. రిత్విక్ (3), ఆనంది (4), అజు (8), ఆయుష్ (10) తన నలుగురి పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ముందుగా పిల్లలను బావిలో తోసి, ఆ తర్వాత తాను దూకి చనిపోయింది. అయితే, ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది సాయంతో మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






