Jaishankar: పాకిస్థాన్ సైనిక వ్యవస్థపై విదేశాంగ మంత్రి జైంకర్ తీవ్ర వ్యాఖ్యలు

by Shamantha N |

పాకిస్థాన్ సైనిక వ్యవస్థపై భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ (S Jaishankar) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాయాది దేశం సీమాంతర ఉగ్రవాదంలో పాల్గొంటుందని.. ఉగ్రసంస్థలకు మద్దతిస్తుందని మండిపడ్డారు.

Jaishankar: పాకిస్థాన్ సైనిక వ్యవస్థపై విదేశాంగ మంత్రి జైంకర్ తీవ్ర వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ సైనిక వ్యవస్థపై భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ (S Jaishankar) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాయాది దేశం సీమాంతర ఉగ్రవాదంలో పాల్గొంటుందని.. ఉగ్రసంస్థలకు మద్దతిస్తుందని మండిపడ్డారు. పాక్ ఆ దేశ ఆర్మీ రెండూ ఉగ్రవాద కార్యకలాపాల్లో నిమగ్నమై ఉందన్నారు. విదేశాల్లో పాక్ చర్యలపై విమర్శలు గుప్పిస్తున్న జైశంకర్.. నెదర్లాండ్స్ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఉస్తున్నారు. తన గడ్డపై జరుగుతోన్న ఉగ్రవాద కార్యకలాపాల గురించి పాకిస్థాన్‌కు తెలియదనే భావనను మంత్రి తీవ్రంగా ఖండించారు. ‘‘ఐక్యరాజ్య సమితి ఆంక్షల జాబితాలోని కరడుకట్టిన ఉగ్రవాదులంతా పాకిస్థాన్‌లోనే ఉన్నారు. పట్టపగలే ఆ దేశంలోని పెద్దపెద్ద నగరాల నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వారు ఎక్కడ ఉంటారో తెలుసు. వారు ఎలాంటి చర్యలకు పాల్పడుతున్నారో అందరికీ తెలుసు. వారి మధ్యలో ఉన్న సంబంధాలు తెలుసు’’ అని జైశంకర్ ఘాటుగా స్పందించారు.

పహెల్గాం ఉగ్రదాడిపై..

పహెల్గాం ఉగ్రదాడిలో పాక్ తన ప్రమేయం లేదని నటిందవద్దని జైశంకర్ చురకలు అంటించారు. పాక్‌ ప్రభుత్వం ఉగ్రసంస్థలకు సహకారం అందిస్తోందన్నారు. పాక్‌ ఆర్మీ సరిహద్దు ఉగ్రవాదంలో పీకల్లోతు కూరుకుపోయిందని మండిపడ్డారు. పాక్ ఉగ్రదాడులు కొనసాగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఉగ్రవాదం, జమ్ముకశ్మీర్ వివాదం భారత్‌కు వేర్వేరు అంశాలని తేల్చిచెప్పారు. పాక్ నుండి ఉత్పన్నమయ్యే ఉగ్రవాద సమస్యకు భారతదేశం కచ్చితమైన ముగింపును కోరుకుంటుందని అన్నారు. పాక్ ను ఆయన గతంలో"ఉగ్రవాద కేంద్రం"గా అభివర్ణించిన వ్యాఖ్యలపైనా స్పందించారు. అదే నిజమని మరోసారి నొక్కి చెప్పారు. అంతకుముందు కూడా మంత్రి ఘాటుగా స్పందించారు.. పాక్‌ నేతలు, మరీ ముఖ్యంగా ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీమ్‌ మునీర్‌పై జైశంకర్ విమర్శలు చేశారు. ‘‘మతం గురించి అడిగి తెలుసుకున్న తర్వాత కుటుంబసభ్యుల ముందే 26 మందిని దారుణంగా హత్య చేశారు. మతపరమైన విభేదాలు సృష్టించడానికి మతం అనే అంశాన్ని ఉద్దేశపూర్వకంగా ముందుకుతెచ్చారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని వెల్లడించారు. కాల్పుల విరమణపై భారత్‌-పాక్‌ నేరుగా చర్చలు జరిపాయన్నారు. కాల్పులు ఆగాలంటే వారు (పాక్‌) నేరుగా తమతో మాట్లాడాలని అమెరికాతో సహా అన్ని దేశాలకు స్పష్టంచేశామని మంత్రి క్లారిటీ ఇచ్చారు.

Next Story