- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
USA: మాకొద్దీ ట్రంప్... అమెరికాలో 40 వేల మంది ఉద్యోగులు రాజీనామాలు? అసలు ఏం జరుగుతోంది?
USA: అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగాల కోత విషయం ట్రంప్ ప్రభుత్వ వ్యూహం నెమ్మదిగా ఫలిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: USA: అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగాల కోత విషయం ట్రంప్ ప్రభుత్వ వ్యూహం నెమ్మదిగా ఫలిస్తోంది. గురువారం ది ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్ మెంట్ ఇచ్చిన బై అవుట్ ఆఫర్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 40వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ కొలువులకు రాజీనామా చేసేందుకు అంగీకరించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంలో పేర్కొంది. ఈ విషయాన్ని ఓపీఎం ధ్రువీకరించింది. క ట్రంప్ కార్యవర్గం ఊహించిన దానికంటే ఈ సంఖ్య చాలా చిన్నదే. ఇది భవిష్యత్తులో వేగంగా పెరుగుతుందని వెల్లడించింది.
బై అవుట్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్ మెంట్ నుంచి ఒక మెమో వెలువడింది. ఈ మేరకు ఒక ఈమెయిల్ 20లక్షల మంది ఉద్యోగులకు వెళ్లింది. స్వచ్చందంగా ఉద్యోగాలను వదులుకుంటే 8నెలల జీతం ఇస్తారని దానిలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 6వ తేదీ లోపు ఓ నిర్ణయానికి రావాలని అందులో వెల్లడించారు దీనిని ఎంచుకున్న వారికి సెప్టెంబర్ వరకు పనిచేయకుండానే జీతం పొందవచ్చని చెబుతున్నా దానికి ఎలాంటి హామీ ఇవ్వలేదని ఉద్యోగ సంఘాలు పెదవి విరుస్తున్నాయి.
కాగా సుమారు 10 నుంచి 15శాత మంది దీనిని ఎంచుకునే అవకాశం ఉందని ట్రంప్ కార్యవర్గం భావించింది. ఇది విజయవంతంగా అమలు అయినట్లయితే అమెరికా ప్రభుత్వ ఖర్చులు ఏటా 100 బిలియన్ డాలర్ల వరకు తగ్గవచ్చని భావిస్తున్నారు. ఓవైపు ఫెడరల్ నిధులు, రుణాలను నిలిపివేసిన వేళ ఈ వార్త బయటకు రావడంతో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చాలా స్థానిక సంస్థల ప్రభుత్వాలు, నాన్ ప్రాఫిట్ సంస్థలపై దీని ప్రభావం ఉంటుందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.






