- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
న్యూఇయర్ వేళ జొమాటో, బ్లింకిట్ రికార్డు.. ఒక్క రోజే అన్ని లక్షలకు పైగా ఆర్డర్‌లు
కొత్త సంవత్సరం వేడుకల వేళ జొమాటో, బ్లింకిట్ సేల్స్ దుమ్ము రేపాయి. ఒక్కరోజే బ్లింకిట్, జొమాటోలో దేశవ్యాప్తంగా 75 లక్షలకు పైగా ఆర్డర్లు వచ్చాయి.

దిశ, వెబ్ డెస్క్: కొత్త సంవత్సరం వేడుకల వేళ జొమాటో, బ్లింకిట్ సేల్స్ దుమ్ము రేపాయి. ఒక్కరోజే బ్లింకిట్, జొమాటోలో దేశవ్యాప్తంగా 75 లక్షలకు పైగా ఆర్డర్లు వచ్చాయి. ఈ విషయాన్ని జొమాటా సీఈఓ దీపిందర్ గోయల్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె ఉన్నప్పటికీ డిసెంబర్ 31న ఒక్క రోజే జొమాటో, బ్లింకిట్ లో అత్యధిక ఆర్డర్లు వచ్చాయని చెప్పాడు. 4.5 లక్షలకుపైగా డెలివరీ ప్రతినిధులు దాదాపు 63 లక్షల మంది కస్టమర్లకు 75 లక్షలకు పైగా ఆర్డర్‌లను చేరవేశారని వెల్లడించారు.
గిగ్ వర్కర్ల సమ్మె ప్రభావం తమపై ఏ మాత్రం పడలేదని చెప్పారు. ఇదిలా ఉంటే జొమాటో ద్వారా ఫుడ్ డెలివరీ చేస్తే బ్లింకిట్ ద్వారా నిత్యావసరాలను డెలివరీ చేస్తున్నారు. అయితే న్యూఇయర్ కావడంతో ఎక్కువ మంది స్పెషల్ ఫుడ్ తినాలనే కోరుకుంటారు. రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లే వాళ్లు వెళతారు. కానీ కొందరు ఇంటివద్దనే ఉండి రెస్టారెంట్ ఫుడ్ తినాలనుకుంటారు. మరికొందరు పార్టీలో ఉండి వెళ్లలేక ఆర్డర్ పెట్టుకుంటారు. అలా న్యూఇయర్ వేళ ఆర్డర్లు పెరిగిపోయాయి. ఇక పార్టీ వేళ నిత్యావసరాలు కూడా అవసరమే కాబట్టి బ్లింకిట్ ఆర్డర్లు కూడా పెరిగాయి.






