- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
11 ఏళ్ల క్రితం మేక్ ఇన్ ఇండియా ప్రారంభంపై ప్రధాని మోడీ ఆసక్తికరమైన ట్వీట్
: సరిగ్గా 11 సంవత్సరాల క్రితం భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఇదే రోజున మేక్ ఇన్ ఇండియా ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేక్ ఇన్ ఇండియా ఉద్యమం 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: సరిగ్గా 11 సంవత్సరాల క్రితం భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi.).. ఇదే రోజున మేక్ ఇన్ ఇండియా (Make in India)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేక్ ఇన్ ఇండియా ఉద్యమం 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ (Interesting tweet) చేశారు. అందులో.. 11 సంవత్సరాల క్రితం ఇదే రోజున, భారతదేశ వృద్ధికి ఊతం ఇవ్వడం, మన దేశ వ్యవస్థాపక సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం అనే దార్శనికత తో మేక్ ఇన్ ఇండియా చొరవ ప్రారంభించబడింది. మేక్ ఇన్ ఇండియా ఆర్థిక బలాన్ని మరింతగా పెంచడానికి మరియు ఆత్మనిర్భరతకు పునాది వేయడానికి ఎలా దోహదపడిందో చూడటం ఆనందంగా ఉంది. ఇది అన్ని రంగాల్లో ఆవిష్కరణ, ఉద్యోగ సృష్టిని ప్రోత్సహించిందని అని ట్వీట్ చేశారు.
2014 సెప్టెంబర్ 25 న ప్రారంభమైన ఈ కార్యక్రమం భారతదేశం వృద్ధి (India's Growth)కి ఊతం ఇవ్వడం, దేశంలోని వ్యవస్థాపక సామర్థ్యాన్ని వినియోగించుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నదని ప్రధాని మోడీ గుర్తుచేశారు. అలాగే ఈ కార్యక్రమం వలన అనేక రంగాల్లో ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలు పెరిగాయని ప్రధాని తెలిపారు. ‘చిప్స్ నుంచి షిప్స్ వరకు’ అన్న దృక్పథంతో భారతదేశంలో ప్రతి ఉత్పత్తి తయారీ సాధ్యం కావాలని, దానిని సాధించేందుకు ప్రభుత్వం వ్యాపార వాతావరణాన్ని సులభతరం చేస్తూ, పెట్టుబడులను ప్రోత్సహిస్తోందని మోడీ వివరించారు. మేక్ ఇన్ ఇండియా ఫలితంగా విదేశీ పెట్టుబడులు పెరగడం, స్థానిక పరిశ్రమలకు ప్రాధాన్యం పెరగడం, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక విధానాలు (PLI) రూపుదిద్దుకోవడం వంటివి సాధ్యమయ్యాయని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.






