Modi: తెలంగాణకు కొత్త నవోదయ విద్యాలయాల మంజూరుపై మోడీ ఆసక్తికర ట్వీట్

by Prasad Jukanti |   (  Updated:2024-12-08 14:17:03  IST  )

తెలంగాణకు కొత్త నవోదయ విద్యాలయాల మంజూరుపై మోడీ ఆసక్తికర ట్వీట్ చేశారు.

Modi: తెలంగాణకు కొత్త నవోదయ విద్యాలయాల మంజూరుపై మోడీ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాఠశాల విద్యను వీలైనంత అందుబాటులోకి తీసుకువచ్చి సమాజంలోని ప్రతి వర్గానికి పాఠశాల విద్యను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) అన్నారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం మరో భారీ నిర్ణయం తీసుకుందన్నారు. దేశవ్యాప్తంగా కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ (Union Cabinet) ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ చర్య పెద్ద సంఖ్యలో విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు అనేక మందికి కొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ట్విట్టర్ వేదికగా ఆయన వరుస పోస్టులు చేశారు. జాతీయ విద్యా విధానం ద్వారా సమాజంలోని ప్రతి వర్గానికి పాఠశాల విద్యను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా 28 కొత్త నవోదయ విద్యాలయాలకు (Navodaya Vidyalayas) మా ప్రభుత్వం ఆమోదం తెలిపిందని దీని వల్ల రెసిడెన్షియల్ మరియు నాణ్యమైన పాఠశాల విద్యను మరింత విస్తృతంగా విస్తరింపజేస్తామని పేర్కొన్నారు. మరో ట్వీట్ చేస్తూ దేశవ్యాప్తంగా కనెక్టివిటీని మెరుగుపరచడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని చెప్పారు. ఇందులో భాగంగా జాతీయ రాజధాని ప్రాంతంలో ఢిల్లీ మెట్రో యొక్క నాల్గవ దశ కింద రిథాలా-కుండ్లి కారిడార్‌ను ఆమోదించిందని ఇది ఢిల్లీ - హర్యానా మధ్య రాకపోకలను సులభతరం చేస్తుందని పేర్కొన్నారు. కాగా నిన్న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నవోదయ పాఠశాలల్లో తెలంగాణకు 7 మంజూరు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో 9 నవోదయ విద్యాలయాలు ఉండగా తాజాగా మంజూరైన వాటితో కలిసి ఆ సంఖ్య 16కు చేరుతుంది.


Click Here For Tweet..

Next Story