- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతర్జాతీయ వేదికపై హాట్ టాపిక్‌గా మోడీ డ్రెస్.. ఈసారి దేనితో తయారు చేశారంటే?
by Satheesh |
వెరైటీ డ్రెస్సింగ్ స్టైల్స్‌తో ఆకట్టుకునే భారత ప్రధాని నరేంద్ర మోడీ అంతర్జాతీయ వేదికపై మరోసారి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: వెరైటీ డ్రెస్సింగ్ స్టైల్స్‌తో ఆకట్టుకునే భారత ప్రధాని నరేంద్ర మోడీ అంతర్జాతీయ వేదికపై మరోసారి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఆదివారం జపాన్‌లోని హిరోషిమా నగరంలో జరిగిన జీ7 సమ్మిట్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ రీసైకిల్ మెటీరియల్‌తో తయారు చేసిన జాకెట్‌ను ధరించారు. కాగా, ఈ జాకెట్‌ను ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేయగా వచ్చిన మెటీరియల్‌తో తయారు చేయడం విశేషం. ఇలాంటి జాకెట్లను ధరించి ప్రధాని మోడీ గతంలో బెంగళూరులో ఓ సమావేశానికి, ఓసారి పార్లమెంట్‌కు వచ్చారు. తాజాగా అంతర్జాతీయ వేదికపై ఇలాంటి జాకెట్ ధరించడం అందరినీ ఆకట్టుకుంది. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేసేందుకు మోడీ ఈ జాకెట్ ధరించారు. దీంతో మరోసారి మోడీ డ్రెస్సింగ్ స్టైల్ అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Next Story






