Cleaning Of Yamuna River : మోడీ ఢిల్లీ ఎన్నికల హామీ..యమునా నది శుద్ధి ప్రారంభం

by Y. Venkata Narasimha Reddy |

యమునా నది శుద్ధి(Cleaning Of Yamuna River)పై ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక(Delhi Assembly Elections)ల్లో ప్రధాని మోడీ(Prime Minister Modi)ఇచ్చిన హామీ మేరకు యమునా నది శుద్ధీకరణ కార్యక్రమం ప్రారంభమైంది.

Cleaning Of Yamuna River : మోడీ ఢిల్లీ ఎన్నికల హామీ..యమునా నది శుద్ధి ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్ : యమునా నది శుద్ధి(Cleaning Of Yamuna River)పై ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక(Delhi Assembly Elections)ల్లో ప్రధాని మోడీ(Prime Minister Modi)ఇచ్చిన హామీ మేరకు యమునా నది శుద్ధీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. అధికారంలోకి వచ్చిన వెంటనే యమునా నది శుద్ధీకరణ చర్యలు తీసుకుంటామని ప్రధాని మోడీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. మోడీ హమీ మేరకు యమునా నది శుభ్రపరిచే పని ప్రారంభమైందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.

రాజ్ నివాస్ సచివాలయం ఎక్స్ క్లీన్ యమునా ఆపరేషన్ ప్రారంభించడాన్ని ధృవీకరించింది, “ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి మోడీ హామీ ఇచ్చినట్లుగా, యమునా శుభ్రపరిచే పనులు ఇప్పటికే ఉత్సాహంతో ప్రారంభమయ్యాయని.. చెత్త స్కిమ్మర్లు, కలుపు మొక్కల తొలగింపు యంత్రాలు, డ్రెడ్జ్ యుటిలిటీ క్రాఫ్ట్ వంటి అధునిక యంత్రాలు నదిలో శుభ్రపరిచే కార్యకలాపాలను ప్రారంభించాయని ఎల్జీ సక్సేనా వెల్లడించారు. మొదట, నది నీటిలో పేరుకుపోయిన వ్యర్థాలు, చెత్త, సిల్ట్ తొలగించబడతాయని..నజాఫ్‌గఢ్ డ్రెయిన్, సప్లిమెంటరీ డ్రెయిన్లు, ఇతర ప్రధాన డ్రెయిన్‌లను శుభ్రపరిచే పనులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు.

అలాగే శుద్ధి ఫ్లాంట్ల సామర్ధ్యం పర్యవేక్షణ, కొత్త వాటి నిర్మాణం అంశాలపై కూడా చర్యలు తీసుకోనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రణాళిక అమలు కోసం, ఢిల్లీ జల్ బోర్డు, నీటిపారుదల, వరద నియంత్రణ, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, పర్యావరణ శాఖ, పీడబ్ల్యుడీ, డీడీఏతో సహా వివిధ సంస్థలు, విభాగాల సమన్వయంతో పనిచేయడంతో పాటు వారానికొకసారి ఉన్నత స్థాయిలో సమీక్ష, పర్యవేక్షణ చేయనున్నారు.

యమునా పునరుద్ధరణ జనవరి 2023లో మిషన్ మోడ్‌లో ప్రారంభమైంది, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఎల్జీ సక్సేనా అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. నది కాలుష్యాన్ని నియంత్రించడం, దానిని శుభ్రపరచడానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవడం ఈ కమిటీ లక్ష్యం. ఢిల్లీలోని పారిశ్రామిక యూనిట్లు మురికి లేదా కలుషితమైన నీటిని కాలువల్లోకి విడుదల చేయకూడదని కమిటీ ఆదేశించింది.

Next Story