- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
8 రోజుల పాటు విదేశాల్లో మోడీ పర్యటన.. 3 దశాబ్ధాల తర్వాత తొలిసారి ఆ దేశానికి..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) రేపటి నుంచి (జూలై 2) 9వ తేదీ వరకు 8 రోజుల పాటు విదేశీ పర్యటించనున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) రేపటి నుంచి (జూలై 2) 9వ తేదీ వరకు 8 రోజుల పాటు విదేశీ (Foreign) పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన ఐదు దేశాలను సందర్శించనున్నారు. ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలకు వెళ్లి పలు ద్వైపాక్షిక సమావేశాలు, వాణిజ్య కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, వ్యాపార, విద్య, ఆరోగ్య, వాతావరణ మార్పుల వంటి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించడమే లక్ష్యంగా మోడీ ఈ దేశాల్లో పర్యటిస్తున్నారు. అయితే, మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకేసారి ఐదు దేశాల్లో పర్యటించడం ఇది రెండోసారి. 2016లో ఆయన అమెరికా, మెక్సికో, స్విట్జర్లాండ్, ఆఫ్గానిస్థాన్, ఖతార్‌లో ఒకేసారి పర్యటించారు. అలాగే, 2015 జులైలో ఆయన ఎనిమిది రోజుల పాటు ఆరు దేశాల్లో పర్యటించారు. ఆ సమయంలో రష్యాతో పాటు మధ్య ఆసియా దేశాల్లో మోదీ పర్యటన కొనసాగింది.
ఇక ఈ పర్యటనలో మోడీ తొలుత జూలై 2, 3 తేదీల్లో ఘనాలో పర్యటించి ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. ఇది మొత్తం ఈ పర్యటనలోనే ఆకర్షణగా నిలిస్తోంది. ఎందుకంటే.. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఘనాలో భారత ప్రధాని పర్యటించడం ఇదే ప్రథమం. గతంలో 1995లో ప్రధాని నర్సింహారావు ఘనాను పర్యటించారు. మోడీ పర్యటన సందర్భంగా భారత్-ఘనా మధ్య పలు ఒప్పందాలు కుదరనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఐటీ, ఆరోగ్య సేవలు, శాంతి స్థాపనలో సహకారం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి.
అనంతరం ప్రధాని ట్రినిడాడ్ అండ్ టొబాగొలలో జులై 3, 4 తేదీల్లో పర్యటించనున్నారు. జులై 4న అర్జెంటీనాకు వెళ్లనున్న ప్రధాని మోదీ.. 5వ తేదీ వరకు అక్కడే పర్యటిస్తారు. రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు, గ్యాస్, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు వంటి కీలక రంగాల్లో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించే అంశంపై ఆ దేశాల నాయకులతో విస్తృత చర్చలు జరుపుతారు. అనంతరం బ్రెజిల్‌లో 5నుంచి 8వ తేదీ వరకు ప్రధాని మోదీ పర్యటిస్తారు. బ్రెజిల్‌లోని రియో వేదికగా జరగనున్న 17వ బ్రిక్స్ సదస్సులో పాల్గొని మోడీ ప్రసంగించనున్నారు. ఈ పర్యటన ద్వారా భారత దేశ అంతర్జాతీయ ప్రతిష్టను పెంపొందించడంలో మోడీ కీలక ముందడుగు వేస్తున్నారు.






