- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచం భారత్ పై ఆశలు పెట్టుకుంది..టోక్యోలో ప్రధాని మోడీ
ప్రధాని మోడీ జపాన్ పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా టోక్యోలో జరిగిన భారత్ జపాన్ జాయింట్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఆయన ప్రసంగించారు. "నమస్తే.. కొన్నిచివా జపాన్" అంటూ ప్రధాని తన స్పీచ్ మొదలుపెట్టారు. ప్రపంచం భారతదేశాన్ని కేవలం చూడటం లేదని,

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ జపాన్ పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా టోక్యోలో జరిగిన భారత్ జపాన్ జాయింట్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఆయన ప్రసంగించారు. "నమస్తే.. కొన్నిచివా జపాన్" అంటూ ప్రధాని తన స్పీచ్ మొదలుపెట్టారు. ప్రపంచం భారతదేశాన్ని కేవలం చూడటం లేదని, భారత్ పై ఆశలు పెట్టుకుందని అన్నారు. భారత్ అభివృద్ధి ప్రయాణంలో జపాన్ ఎల్లప్పుడూ ముఖ్యమైన భాగస్వామిగా ఉందని చెప్పారు.
మెట్రో రైలు నుండి సెమీ కండక్టర్లు మరియు స్టార్టప్‌ల వరకు జపాన్ కంపెనీలు భారత్‌లో 40 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టాయని చెప్పారు. భారతదేశంలో మూలధనం కేలవం పెరగటంలేదు అది రెట్టింపు అవుతుందని అన్నారు. భారత్ నేడు రాజకీయ స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వాలను కలిగి ఉందన్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని వ్యాఖ్యానించారు. అతి త్వరలో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని చెప్పారు.






