మునిగిపోవడం ప్రాక్టీస్ చేస్తున్నారు.. రాహుల్ వీడియోపై మోడీ సెటైర్లు

by Ajay Maddhiboyina |

ఇటీవ‌ల బీహార్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ మ‌త్స్య‌కారుల‌తో క‌లిసి చేప‌ల వేట చేసిన సంగ‌తి తెలిసిందే. ఓ ప్రాంతంలో మ‌త్య్స‌కారులు చేప‌లు ప‌డుతుండ‌గా వెళ్లిన రాహుల్ ప‌డ‌వ నుండి కింద‌కు దూకి వారితో క‌లిసి చేప‌ల‌కు వ‌ల విసిరారు.

మునిగిపోవడం ప్రాక్టీస్ చేస్తున్నారు.. రాహుల్ వీడియోపై మోడీ సెటైర్లు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇటీవ‌ల బీహార్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ మ‌త్స్య‌కారుల‌తో క‌లిసి చేప‌ల వేట చేసిన సంగ‌తి తెలిసిందే. ఓ ప్రాంతంలో మ‌త్య్స‌కారులు చేప‌లు ప‌డుతుండ‌గా వెళ్లిన రాహుల్ ప‌డ‌వ నుండి కింద‌కు దూకి వారితో క‌లిసి చేప‌ల‌కు వ‌ల విసిరారు. కాసేపు వారితో స‌ర‌దాగా ముచ్చ‌టించారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యింది. కాగా తాజాగా ఈ వీడియోపై ప్ర‌ధాని మోడీ స్పందించారు.

బీహార్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న మోడీ మాట్లాడుతూ.. కొంత‌మంది పెద్ద నాయ‌కులు చేప‌ల‌ను చూసేందుకు ఇక్క‌డికి వ‌స్తున్నారు. బీహార్ ఎన్నిక‌ల్లో మునిపోవ‌డం వాళ్లు ప్రాక్టీస్ చేస్తూ నీటిలో దూకుతున్నార‌ని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ఆర్జేడీ నేతృత్వంలోని ప్ర‌తిప‌క్షాల‌పై కూడా తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. రాష్ట్రంలోని యువ‌త‌ను గూండాలుగా, గ్యాంగ్ స్ట‌ర్లుగా మార్చ‌డానికి వారు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. ఎన్నిక‌ల్లో గెలిస్తే త‌మ త‌ల‌పై నాటు తుపాకులు పెడ‌తార‌ని వారికి ఓటు వేసేందుకు ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నార‌ని ఆరోపించారు.

Next Story