పుతిన్ కళ్లలోకి చూస్తూ.. ఇది యుద్ధానికి సమయం కాదని చెప్పా: మోడీ

by Disha Web Desk 17 |
పుతిన్ కళ్లలోకి చూస్తూ.. ఇది యుద్ధానికి సమయం కాదని చెప్పా: మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కళ్లలోకి చూస్తూ ఇది యుద్ధానికి సమయం కాదని చెప్పినట్లు ప్రధాని మోడీ శుక్రవారం ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ప్రపంచ ఉద్రిక్తతలు, సంఘర్షణలపై స్పందించడంలో మీ పాత్ర ఎలా ఉంటుందని ప్రధానిని అడిగిన ప్రశ్నకు ఆయన యుద్ధాన్ని కాకుండా శాంతిని ఇష్టపడతానని అన్నారు. ఇంకా మోడీ మాట్లాడుతూ, చాలా దేశాలు ఎవరో ఒకరి పక్షాన ఉంటాయి. కానీ భారత్‌ మాత్రం ఎవరి పక్షం కాదు, శాంతికి అనుకూలంగా మాత్రమే ఉంటుంది. అందుకనే ఆయుధాలు ఇవ్వడం గురించి లేదా పోరాడాలని మాట్లాడకుండా ఉండే వ్యక్తులు మనం మాత్రమే అని ప్రపంచానికి నమ్మకం ఉందని మోడీ అన్నారు.

ప్రపంచంలో భారతదేశం తన స్థానాన్ని సృష్టించుకుంది, దీని కారణంగానే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కళ్లలోకి చూసి, ఇది యుద్ధానికి సమయం కాదని చెప్పడానికి నాకు ధైర్యం వచ్చిందని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే, ఈ ఏడాది చివర్లో జరగనున్న వివిధ శిఖరాగ్ర సమావేశాల కోసం వచ్చిన ఆహ్వానాలపై మోడీ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో పెద్దగా మాట్లాడటం సరికాదు. భారతదేశంలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో ప్రపంచానికి తెలుసు. జూన్, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జరిగే కార్యక్రమాలకు ఆహ్వానాలు అందాయి. G7తో సహా అన్ని దేశాలలోని గ్రూపులు ఏదో ఒక విధంగా భారతదేశం ప్రాతినిధ్యాన్ని కోరుకుంటున్నాయని తెలిపారు.

కేంద్ర సంస్థలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మోదీ మాట్లాడుతూ, నేను అధికారంలోకి రాగానే దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాను. వ్యక్తి లేదా పార్టీతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని ఏజెన్సీలకు స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed