- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kharge: నీ 'వారసుడి' మాటలకు సమాధానం చెప్పు.. మోడీపై ఖర్గే ఫైర్
మోడీ స్నేహితులే దేశంలో సంక్షోభాలు సృష్టిస్తున్నారని ఏఐసీసీ చీఫ్ ఖర్గే ధ్వజత్తారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) ఎవరినైతే నా మిత్రులు అంటూ పొగిడారో వారే ఇప్పుడు భారత్‍ను అనేక సంక్షోభాల్లోకి నెడుతున్నారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjuna Kharge) విమర్శించారు. మన దేశాన్ని చుట్టుముట్టిన అంతర్జాతీయ సమస్యలన్నీ ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన ప్రభుత్వ దౌత్యపరమైన వైఫల్యాలే అని ధ్వజమెత్తారు. ఇవాళ బిహార్ లోని సదాకత్ ఆశ్రమంలో ప్రారంభమైన సీడబ్ల్యూసీ (CWC) సమావేశాల్లో ఖర్గే మాట్లాడారు. దేశంలో ఓటర్ల జాబితాను తారుమారు చేస్తున్న సందర్భంలో ప్రజాస్వామ్యానికి తల్లి అయిన బిహార్ లోఈ సమావేశాలు నిర్వహించడం అవసరం అన్నారు.
నితీశ్‍ను మానసిక రిటైర్మెంట్:
ఈ సందర్భంగా బిహార్ సీఎం నితీశ్ కుమార్‍ను ఖర్గే టార్గెట్ చేశారు. బీజేపీ నితీశ్ కుమార్ ను మానసికంగా రిటైర్ చేసిందని ఆరోపించారు రాబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికలు కేంద్రంలోని మోడీ అవినీతి పాలన ముగింపుకు నాంది పలుకుతాయని జోస్యం చెప్పారు. నితీశ్ కుమార్ మద్దతుతోనే కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలో ఉందని ఈ మద్దతుకు బదులుగా బిహార్ అభివృద్ధికి కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. కానీ బిహార్ ఆర్థిక వ్యవస్య వెనుకబడిపోయిందని నిరుద్యోగం పెరిగిపోయిందని విమర్శించారు. లక్షలాది మంది ప్రజల ఓట్లను తొలగించడానికి దేశవ్యాప్తంగా ఇప్పుడు కుట్ర జరుగుతోందని బిహార్‍లో ఎస్ఐఆర్ ఇందుకు ఉదాహరణ అన్నారు. ఓటు చోరీ అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు చెందిన రేషన్లు, పెన్షన్లు, మందులు, పిల్లల స్కాలర్‌షిప్‌లు, పరీక్ష ఫీజులను దొంగిలించడమేనని ఆరోపించారు.
నీ వారసుడి మాటలకు సమాధానం చెప్పు:
పోలీసు రికార్డులతో పాటు బహిరంగ ప్రదేశాలలో కులం ప్రస్తావన నిషేధిస్తూ యూపీ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంపై ఖర్గే మండిపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వారసుడిగా తనను తాను భావించుకునే ఆదిత్యనాథ్ యోగి (Adhityanath Yogi) తీసుకున్న ఈ నిర్ణయం విచిత్రంగా ఉందని విమర్శించారు. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ గతంలో ఓ వ్యాసం రాసిన ఈయనే ఇప్పుడు కులాల పేరుతో జరిగే ర్యాలీలను నిషేధించారని దుయ్యబట్టారు. మీ ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంపై దేశ ప్రజలకు మోడీ సమాధానం చెప్పాలని ఖర్గే డిమాండ్ చేశారు.






