- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MODI: నన్ను విమర్శించడం వారి జన్మహక్కుగా భావిస్తున్నారు.. రాహుల్, తేజస్వీపై ప్రధాని మోడీ ఫైర్
బెయిల్‍పై బయట ఉన్న వారిని ప్రజలు నమ్మరని మోడీ ఆర్జేడీ, కాంగ్రెస్ పై

దిశ, డైనమిక్ బ్యూరో:తనను విమర్శించడం తమ జన్మహక్కుగా భావిస్తున్నారని రాహుల్ గాంధీ, తేజస్వీయాదవ్‍పై ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) విరుచుకుపడ్డారు. ఈ ఇద్దరు యువరాజుల కుటుంబాలు అత్యంత అవినీతిమయమైన కుటుంబాలు అని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ, తేజస్వీయాదవ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ కోట్ల రూపాయల స్కామ్‍లలో బెయిల్‍పై బయట ఉన్న ఈ ఇద్దరు నామ్‍దార్‍లు ప్రజల కోసం పని చేస్తున్న కామ్‍దార్‍ను దూషిస్తున్నారని మండ్డారు. ఒక చాయ్ వాలా ఇంతటి స్థాయికి రావడాన్ని వారు భరించలేక నన్ను తిడుతున్నారన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar elections 2025) నేపథ్యంలో గురువారం ప్రధాని మోడీ ముజఫ్ఫర్ పుర్ లోని ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆర్జేడీ-కాంగ్రెస్ నకిలీ హామీల దుకాణం తెరిచిందన్నారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi), తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) జమనాత్‍పై బయట ఉన్నారని అలాంటి వారినెవరినైనా ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నారు. ఆర్జేడీ-కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. ఈ రెండు పార్టీలు నీరు, నూనె వంటివని ఈ పార్టీల మధ్య సఖ్యత లేదని ఆరోపించారు. ఆ పార్టీలు ఎక్కడుంటే అక్కడ జంగిల్ రాజ్ వస్తుందని మోడీ దుయ్యబట్టారు.
ఆర్జేడీ-కాంగ్రెస్ ‘5-K’ సర్కార్:
ఈ సందర్భంగా ఆర్జేడీ-కాంగ్రెస్ పాలనను ప్రధాని '5-k' తో పోల్చారు. K-కట్టా(నాటుతుపాకీ),K-క్రూరతా(క్రూరత్వం),K-కటుత(దురుద్దేశం),K-కుశాసన(సుపరిపాలన లేకపోవడం), K-కరప్షన్ (అవినీతి) ఈ ఐదు విధానాలే ఆర్జేడీ, కాంగ్రెస్ పాలనా విధానాలు అని దుయ్యపట్టారు. కాంగ్రెస్, ఆర్జేడీ చఠ్ పూజను అవమానించేలా మాట్లాడుతున్నారని ఓట్ల కోసం పవిత్రమైన పండగను అవమానించవచ్చా అని ప్రశ్నించారు. ఇలాంటి అవమానాలను నీళ్లు లేకుండా ఉపవాసం ఉండే తల్లులు దీన్ని సహిస్తారా? అని ప్రశ్నించారు. ఆర్జేడీ, కాంగ్రెస్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నాయని వారికి చఠ్ పూజ కేవలం ఒక నాటకం ప్రహసనం వంటిదని అలాంటి అవమానాలను బిహార్ ఎన్నటికీ క్షమించదన్నారు.






