Modi: 'ఈ క్లిష్ట పరిస్థితుల్లో అండగా ఉంటాం'.. మయన్మార్, థాయ్ లాండ్ కు మోడీ భరోసా

by Prasad Jukanti |

భూకంపం ధాటికి అతలాకుతలంగా మారిన మయన్మార్, థాయ్ లాండ్ కు మోడీ భరోసా ఇచ్చారు.

Modi: ఈ క్లిష్ట పరిస్థితుల్లో అండగా ఉంటాం.. మయన్మార్, థాయ్ లాండ్ కు మోడీ భరోసా
X

దిశ, డైనమిక్ బ్యూరో: మయన్మార్ (Myanmar) దాని పొరుగున ఉన్న థాయ్ లాండ్ (Thailand) లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. వరుసగా భూమి కంపించడంతో పలు భవనాలు నేలకొరిగాయి. భూకంపధాటికి భవనాలు ధ్వంసమైన దృశ్యాలు సోషల్ మీడియాలో భయానకంగా కనిపిస్తున్నాయి. ప్రజలందరు హాహాకారాలతో బయటకు పరుగులు తీస్తున్నారు. ఈ భూకంపంపై ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మయన్మార్, థాయ్ లాండ్ కు అండగా ఉంటామని పీఎం ప్రకటించారు. ఈ కష్టసమయంలో అన్ని విధాలా భారత్ సాహాయం సహాకరం అందిస్తామని మీకు అండగా ఉండామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన తన ఆందోళనను వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నాన్నారు. సహాయక చర్యలపై ఆయా దేశాల ప్రభఉత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరపాలని విదేసాఖ శాఖను మోడీ ఆదేశించారు. రెండు దేశాల్లో సంభవించిన భూకంపం ధాటికి పలు భవవనాలు, పురాతన దేవాలయాలతో పాటు చారిత్రక కట్టడాలు ధ్వంసమయ్యాయి. భూకంప దృశ్యాలు చూస్తే ప్రాణనష్టం భారీగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

Next Story