- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Modi Good News: జీఎస్టీ తర్వాత మోడీ మరో గుడ్ న్యూస్!.. త్వరలో అధికారిక ప్రకటన?
జీఎస్టీలో భారీ సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం తాజాగా మరో కొత్త స్కీమ్ తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ట్రంప్ టారిఫ్ ల భయంతో ప్రపంచ మార్కెట్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. యూఎస్ సుంకాల (US Tariffs) ఎఫెక్ట్ భారత్ పై కూడా పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కొత్త స్కీమ్ తీసుకురాబోతున్నది. ఎగుమతి దారులకు ఊరట కల్పిస్తూ రిలీఫ్ ప్యాకేజీలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే జీఎస్టీలో (GST) భారీ సంస్కరణలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా అమెరికా సుంకాల దెబ్బతో ప్రభావితమైన ఎగుమతి దారులకు ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధం అవుతున్నదని, త్వరలోనే ప్రభుత్వం ప్రకటన చేయబోతున్నదని ఈ మేరకు శుక్రవారం అధికారిక వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఎగుమతి దారులకు ఆ ఒత్తిడి లేకుండా పరిష్కారం:
రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటోందన్న కారణంతో భారత్ పై యూఎస్ గత నెల నుంచి 50 శాతం టారిఫ్ లు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే యూఎస్ నిర్ణయాల విషయంలో భారత ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. దేశ ప్రయోజనాలను తాకట్టుపెట్టేందుకు తాము సిద్ధంగా లేమని ట్రంప్ సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం తేల్చి చెబుతోంది. కానీ ట్రంప్ చర్యల వల్ల దేశంలోని వస్త్ర వ్యాపారులు, రత్నాలు, ఆభరణాలు వంటి కీలక పరిశ్రమలు ప్రతికూలతలను ఎదుర్కొంటున్నారు. పాదరక్షలు, రసాయనాలు, ఇంజనీరింగ్ వస్తువులు, అగ్రికల్చర్, అక్వా ఉత్పత్తిదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి వరకు యూఎస్ లో ఏర్పాటు చేసుకున్న మార్కెటింగ్ ను కాదని తమ ఎగుమతుల విషయంలో ప్రపంచంలోని ఇతర మార్కెట్లను (Global Trade Challenges) వెతుక్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఎగుమతి దారులు ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లను అదిగమించేలా వారికి ఊతమిచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోబోతున్నది. చిన్న ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న లిక్విడిటీ సమస్యల పరిష్కారాం చేపే దిశగా కేంద్రం నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే వర్కింగ్ క్యాపిటల్‌పై ఒత్తిడి తగ్గించడం, ఎగుమతులపై ఆధారపడిన అసురక్షిత రంగాల్లో ఉద్యోగ భద్రత కల్పించనున్నట్లు తెలుస్తోంది. కొత్త మార్కెట్ల అన్వేషణ జరుగుతూనే ఉత్పత్తి అంతరాయం లేకుండా కొనసాగించడంపై దృష్టి సారించేలా చర్యలు తీసుకోబోతున్నట్లు వర్గాలు సూచిస్తున్నాయి.






