Mock drills: సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్.. కీలక అంశాలపై అవగాహన

by B.Srinivas |

ఆపరేషన్ షీల్డ్ పేరుతో జమ్మూ కశ్మీర్, చండీగఢ్ సహా పంజాబ్, రాజస్థాన్, హర్యానా, రాజస్థాన్‌ లలో మాక్ డ్రిల్స్ నిర్వహించారు.

Mock drills: సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్.. కీలక అంశాలపై అవగాహన
X

దిశ, నేషనల్ బ్యూరో: యుద్ధం లాంటి టైంలో అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి ఆపరేషన్ షీల్డ్ పేరుతో జమ్మూ కశ్మీర్, చండీగఢ్ సహా పంజాబ్, రాజస్థాన్, హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో శనివారం మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఘర్షణల సమయంలో వేగంగా ప్రతిస్పందించడం, తమకు తాము రక్షించుకోవడం, బాంబు పేలుడు జరిగినప్పుడు గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో విన్యాసాలు నిర్వహించారు. పలు చోట్ల విద్యుత్ నిలిపివేసి బ్లాక్ అవుట్ చేశారు. సరిహద్దు జిల్లా అయిన పంజాబ్‌లోని ఫాజిల్కాలో అరగంట పాటు బ్లాక్ అవుట్ డ్రిల్స్ చేపట్టారు. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక దళం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఇతర అధికారులు ఇందులో భాగస్వామ్యమయ్యారు. కాగా, మే 29నే మాక్ డ్రిల్స్ జరగాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే.

Next Story