- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
LPG దెబ్బ...ఫోన్స్, ఇంటర్నెట్‌పై ఎఫెక్ట్ !
LPG కొరత కారణంగా ఫోన్స్, ఇంటర్నెట్‌పై ఎఫెక్ట్ పడే ఛాన్సు ఉందని అంటున్నారు.

దిశ, వెబ్ డెస్క్: మిడిల్ ఈస్ట్ దేశాలలో యుద్ధ వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ ను టార్గెట్ చేయకుండా మిడిలిస్ట్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. దీని ఎఫెక్ట్ కారణంగా ఇండియాలో LPG కొరత ఏర్పడింది. ఎల్పిజి కొరత ఏర్పడిన నేపథ్యంలో హోటల్స్ యజమానులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అడుగు గృహ వినియోగదారులకు కూడా గ్యాస్ సిలిండర్లు దొరికే పరిస్థితులు లేవని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే, ఇలాంటి నేపథ్యంలో ఈ ఎల్పీజీ కొరత మొబైల్స్, ఇంటర్నెట్ సేవల పైన కూడా పడే ప్రమాదం పొంచి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
టెలికాం టవర్ తయారీ సంస్థలకు సప్లై చేసే గ్యాస్ పూర్తిగా నిలిచిపోయింది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ పరిస్థితి ఏర్పడింది. వాస్తవంగా టెలికాం టవర్లు తుప్పు పట్టకుండా తయారీ సమయంలో జింక్ తో వేసే రక్షణ పొర కోసం ఎల్పీజీ వాడతారని చెబుతున్నారు. ఈ గాల్వనైజేషన్ ప్రాసెస్ కోసం తగిన LPG లేకపోతే ఆపరేషన్ పూర్తిగా నిలిపివేయాల్సి వస్తుందని ప్రొడక్షన్ చేసేవారు స్పష్టం చేస్తున్నారు. దీని ఎఫెక్ట్ కారణంగా నెట్వర్క్ విస్తరణ నెమ్మదించి కనెక్టివిటీపై ప్రభావం పడుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో మొబైల్ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాదు ఇంటర్నెట్ వ్యవస్థ లేకపోతే భారతదేశం మొత్తం స్థంభించే ప్రమాదం ఉంటుంది.
LPG సమస్యపై కేంద్రం కీలక నిర్ణయం
భారతదేశంలో LPG ఉత్పత్తిని పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. LPG కొరత ఏర్పడుతున్న కేంద్ర కేబినెట్ అత్యవసరంగా ఏర్పాటు అయింది. ఈ తరుణంలో భారతదేశ వ్యాప్తంగా 10% LPG ఉత్పత్తిని పెంచాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.






