- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీవీకే విజయ్‌కి స్టాలిన్ శుభాకాంక్షలు.. వామపక్షాల నిర్ణయానికి ప్రశంస
టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిన నేపథ్యంలో డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ కీలక ట్వీట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిన నేపథ్యంలో డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ కీలక ట్వీట్ చేశారు. కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సీట్లు రానప్పటికీ గణనీయమైన సంఖ్యలో ఓట్లను సాధించామని ఆయన గుర్తుచేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అడ్డుపడబోమని, నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేస్తామని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరికీ మెజారిటీ లభించని పరిస్థితిలో, తమ మిత్రపక్షాలు ఏ నిర్ణయం తీసుకున్నా వారి నిర్ణయాన్ని గౌరవిస్తామని, సమన్వయంతో వ్యవహరించాలని, స్థిరమైన ప్రభుత్వం ఏర్పడేలా చూడాలన్నారు. అంతేగానీ మరో ఎన్నికలకు దారి తీయకూడదని తాము నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత సంక్షోభాన్ని నివారించడానికి, తమిళనాడులో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తాము మద్దతు తెలిపినప్పటికీ, విధానపరంగా డీఎంకే నేతృత్వంలోని లౌకిక ప్రగతిశీల కూటమిలోనే కొనసాగుతామని తమ కూటమి సహచరులు చేసిన ప్రకటనను స్టాలిన్ స్వాగతించారు.
అయితే కాంగ్రెస్ పొత్తు ధర్మాన్ని తుంగలో తొక్కిందని, అదేరోజు కాంగ్రెస్‌తో తమకు సంబంధాలు తెగిపోయాయని అన్నారు. అదే సమయంలో, కమ్యూనిస్ట్ నాయకులు కామ్రేడ్ షణ్ముగం, కామ్రేడ్ వీరపాండియన్‌లతో పాటు విదుతలై చిరుతైగళ్ కచ్చి పార్టీ నాయకుడు తిరుమావళవన్, తాము డీఎంకేతో చేతులు కలిపి తమిళనాడు హక్కులు, ప్రజల సంక్షేమం కోసం పోరాడుతూనే ఉంటామని ప్రకటించారన్నారు. తద్వారా వారు డీఎంకేపై తమ విశ్వాసాన్ని ప్రదర్శించారన్నారు. ఈ కీలక సమయంలో తమతో దృఢంగా నిలబడిన నాయకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాలకు మంచి చేసేలా కొత్త ప్రభుత్వ పనితీరు ఉంటుందని ఆకాక్షిస్తున్నట్లు స్టాలిన్ పేర్కొన్నారు.






