పంజాబ్‌లో దారుణం.. కదులుతున్న కారులో మైనర్‌పై అత్యాచారం.. ఒకరి తర్వాత ఒకరు హింసిస్తూ..

by Sujitha Rachapalli |

పంజాబ్‌ మొహాలీ జిల్లాలోని జిరక్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ సెలూన్‌లో పని చేసి ఇంటికెళ్తున్న పదహారేళ్ల బాలికను వీఐపీ రోడ్డులోని మెట్రో మాల్ సమీపంలో బలవంతంగా కిడ్నాప్ చేశారు ఇద్దరు వ్యక్తులు. చండీగఢ్-అంబాలా జాతీయ

పంజాబ్‌లో దారుణం.. కదులుతున్న కారులో మైనర్‌పై అత్యాచారం.. ఒకరి తర్వాత ఒకరు హింసిస్తూ..
X

దిశ, వెబ్ డెస్క్: పంజాబ్‌ మొహాలీ జిల్లాలోని జిరక్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ సెలూన్‌లో పని చేసి ఇంటికెళ్తున్న పదహారేళ్ల బాలికను వీఐపీ రోడ్డులోని మెట్రో మాల్ సమీపంలో బలవంతంగా కిడ్నాప్ చేశారు ఇద్దరు వ్యక్తులు. చండీగఢ్-అంబాలా జాతీయ రహదారి దగ్గర ఆటో రిక్షా కోసం వెయిట్ చేస్తున్న బాధితురాలిని.. కారులోకి బలవంతంగా లాగి ఎత్తుకెళ్లారు. ఆమె సోదరుడి పేరును ప్రస్తావిస్తూ ఆమెపై దాడి చేసి.. జిరక్‌పూర్, చండీగఢ్‌లోని ట్రిబ్యూన్ చౌక్, మొహాలీ ఫేజ్ 11లోని అటవీ ప్రాంతం గుండా కారులో తిప్పుతూ.. అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత కిడ్నాప్ చేసిన స్థలం సమీపంలోనే వదిలిపెట్టారు.

బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జిరక్‌పూర్ పోలీసులు.. పోక్సో, అత్యాచారం కేసులు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలిస్తున్న పోలీసులు.. కారు, నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బాధితురాలి అడ్వకేట్ మల్కిత్ కౌర్.. పోలీసులు కేసును తప్పు దారి పట్టిస్తున్నారని ఆరోపించారు. వైద్య పరీక్షలో ఆలస్యం చేశారని.. బాధితురాలి తల్లిని మెడికల్ ఎగ్జామినేషన్ సమయంతో ఆమెతో ఉండనివ్వలేదని ఆరోపించారు.

Next Story