- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన
by Muthe.Rajitha |
తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు. మరికొద్దిసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్న ఉత్తమ్.. సాయంత్రం 7 గంటలకు కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో సమావేశమవుతారు. ఈ సమావేశంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు కోసం విజ్ఞప్తి చేయనున్నారు. ఇప్పటికే పర్యావరణ విచారణలు పూర్తి చేసిన ఈ ప్రాజెక్టు పెండింగ్‌లో ఉన్నందున దీనిపై దృష్టి సారించనున్నారు. అలాగే ఇతర పెండింగ్ ప్రాజెక్టులు కూడా చర్చకు రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టు డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఈ సమావేశం కీలకంగా మారింది. ఏపీ చేపట్టనున్న నల్లమల సాగర్ పై కూడా చర్చించే అవకాశం ఉందని సమాచారం.
Next Story






