Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై సభలో ప్రభుత్వం కీలక ప్రకటన

by Prasad Jukanti |

విమాన ప్రమాదం ఘటన విషయంలో మీడియా తీరుపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై సభలో ప్రభుత్వం కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: అహ్మదాబాద్ లో (Ahmedabad) ఎయిరిండియా (Air India) విమాన ప్రమాదంపై పూర్తిస్థాయిలో పారదర్శకంగా ఎక్వైయిరీ జరుగుతోందని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) చెప్పారు. క్రాష్ రిపోర్టులో పక్షపాతం లేదని కానీ ఓ వైపు దర్యాప్తు జరుగుతుంటే మరో వైపు విదేశీ మీడియా సొంత కథనాలతో అసత్యాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సోషల్ మీడియాలోనూ రకరకాల కథనాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇవాళ రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ మంత్రి కీలక విషయాలు వెల్లడించారు. భారతదేశం మొదటిసారి బ్లాక్ బాక్స్ ను డీకోడ్ చేసిందని బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నా డేటాను రిట్రీవ్ చేయగలిగామని తెలిపారు. కాక్ పిట్ రికార్డర్ కు సంబంధించిన అన్ని వివరాలు ఉన్నాయన్నారు. ప్రమాదంపై ప్రాథమిక నివేదిక వచ్చిందని ఈ నివేదికను పరిశీలిస్తున్నామన్నారు. తుది నివేదిక వచ్చాక మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. దర్యాప్తులో ఇంట్రనేషనల్ ప్రోటోకాల్ ను ఫాలో అవుతున్నామని ఏం జరిగింది? ఎలా జరిగిందో తెలుసుకుంటున్నామన్నారు. భవిష్యత్ లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఈ పదేళ్లలో దేశంలోని విమానాశ్రయాలు రెండింతలు అయ్యాయని విమానాశ్రయాల అభివృద్ధి, విస్తరణకు చర్యలు తీసుకుంటున్నాం. కొన్ని విమానాశ్రయాల విస్తరణకు స్థానికంగా అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుుకంటున్నాం. 90 శాతం వరకు పోస్టుల భర్తీ జరిగేలా చూస్తామన్నారు. పైలట్లకు విశ్రాంతి విషయంలో వచ్చిన సూచనలు స్వీకరిస్తామన్నారు. దేశంలో రోజుకు 5 లక్షల మంది విమానాల్లో సురక్షితంగా ప్రయాణిస్తున్నారని వెల్లడించారు. ఈ ఘటనలో మరణించిన ప్రయాణికులు, మెడికల్ కాలేజీ విద్యార్థుల కుటుంబాలకు ఒకే విధమైన పరిహారం అందుతుందని వారి కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు.

Next Story