- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీలో మూడ్రోజులు ఉంటే ఇన్ఫెక్షన్.. కాలుష్యంపై మంత్రి నితిన్ గడ్కరీ ఆవేదన
దేశ రాజధాని ఢిల్లీలో నెలకొన్న భయంకరమైన వాయు కాలుష్యంపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

* దేశ రాజధాని నగరంలో కాలుష్యంపై గడ్కరీ ఆవేదన..
* 40% కాలుష్యానికి తన శాఖే కారణం" అన్న మంత్రి..
* ఢిల్లీ పౌరుల ఆయుర్దాయం 10 ఏళ్లు తగ్గే ప్రమాదం..
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో నెలకొన్న భయంకరమైన వాయు కాలుష్యం (Air pollution)పై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేవలం మూడు రోజులు ఉంటేనే తనకు అలర్జీ, గొంతు నొప్పి వంటి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని ఆయన స్వయంగా వెల్లడించారు. ఢిల్లీకి వచ్చిన ప్రతిసారీ ఇక్కడి కాలుష్యం చూసి ఎప్పుడు తిరిగి వెళ్దామా అనిపిస్తుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోని మొత్తం వాయు కాలుష్యంలో సుమారు 40 శాతం కేవలం రవాణా రంగం వల్లే జరుగుతుందని, ఆ శాఖ మంత్రిగా దీనికి తానే బాధ్యత వహిస్తున్నానని ఆయన నిక్కచ్చిగా అంగీకరించారు.
ఇదే పరిస్థితి కొనసాగితే ఢిల్లీ పౌరుల సగటు ఆయుర్దాయం 10 ఏళ్లు తగ్గే ప్రమాదం ఉందని ఒక వైద్య నివేదికను ఉటంకిస్తూ గడ్కరీ హెచ్చరించారు. కాలుష్య నివారణకు పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాలు మరియు గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఏటా రూ. 22 లక్షల కోట్ల విలువైన ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటున్నామని, దీనిని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు.






