- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశ పురోగతిలో మైనింగ్రంగం పాత్ర కీలకం..పార్లమెంటులో మైనింగ్బిల్లుపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వివరణ
దేశ పురోగతిలో మైనింగ్ రంగం పాత్ర కీలకమని, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లో క్రిటికల్ మినరల్స్ పాత్ర కీలకమని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : దేశ పురోగతిలో మైనింగ్ రంగం పాత్ర కీలకమని, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లో క్రిటికల్ మినరల్స్ పాత్ర కీలకమని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఇంతటి కీలకమైన క్రిటికల్ మినరల్స్ కోసం మనం మనం విదేశాలపై ఆధారపడుతున్నామని దేశంలో క్రిటికల్ మినరల్ ఉత్పత్తి తక్కువగా ఉందన్నారు. మంగళవారం మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్‌మెంట్, రెగ్యులేషన్ యాక్ట్ కు సవరణలకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రవేశపెట్టడంతోపాటుగా, బిల్లు గురించి వివరిస్తూ లోక్‌సభలో ప్రసంగించారు. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్‌మెంట్, రెగ్యులేషన్ యాక్ట్ సవరణలను ప్రతిపాదిస్తూ సభ ముందుకు తీసుకొచ్చాం. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రధాని మోడీ ఈ రంగంలో సమూల సంస్కరణలకు ప్రోత్సహించారు. వారి మార్గదర్శనంలో ఈ ఎంఎండీఆర్చట్టానికి 2015, 2021, 2023లో సవరణలు తీసుకొచ్చామని, నేడు మరో 6 సవరణలు తీసుకొచ్చి సభ ముందు ప్రతిపాదనలు పెట్టామన్నారు. మైనింగ్ రంగం ద్వారా ఉపాధి కల్పన పెరగాలి, ఆర్థిక పరిస్థితిని మరింతగా పెంపొందించేందుకు మోడీ ఆలోచనలతో ముందుకెళ్తున్నాం. 2014కు ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ద్వారా మైన్స్ కేటాయింపులు ఎలా జరిగేవో అందరికీ తెలుసు అన్నారు. ఓ చిట్టీపై రాసిస్తే గనుల కేటాయింపులు జరిగేవి. కానీ 2014 తర్వాత సంస్కరణలు తీసుకొచ్చి సంపూర్ణ పారదర్శకతతో వేలం ద్వారా గనుల కేటాయింపు జరుగుతోంది.
దేశంలో క్రిటికల్ మినరల్స్ డిమాండ్ పెరిగింది :
రానున్న రోజుల్లో క్రిటికల్ మినరల్ పాత్ర మరింత కీలకంగా మారనుంది. ఈ ఏడాది ప్రారంభంలో క్రిటికల్ మినరల్ మిషన్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మిషన్ ను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో చట్టంలో సవరణలు ప్రవేశపెట్టామన్నారు. సోలార్ ప్యానెల్స్ నుంచి విండ్ టర్బయిన్స్ వరకు, వ్యవసాయం నుంచి వైద్య పరికరాల వరకు, ఎలక్ట్రానిక్స్ నుంచి ఎలక్ట్రిసిటీ వరకు, సెల్ ఫోన్ నుంచి విమానాల వరకు, డిఫెన్స్ నుంచి స్పోర్ట్స్ వరకు ప్రతి రంగంలో క్రిటికల్ మినరల్ పాత్ర కీలకమన్నారు. విదేశాల్లోని క్రిటికల్ మినరల్ ను భారతదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం లిథియం కోసం జాంబియా, అర్జెంటినా వంటి వేర్వేరు దేశాలకు వెళ్తుతూ ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నామని చెప్పారు. ఈ సవరణలకు మద్దతుగా నిలుస్తాయని అనుకున్నాను. కానీ ఎప్పటిలాగే ఈ పార్టీలు అభివృద్ధికి ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. కొందరు నాయకులకు ఈ దేశంలో మైనింగ్ రంగం, దేశ సైన్యం, దేశ ఆర్థిక వ్యవస్థపై నమ్మకం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఇలా దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అడ్డంకులను సృష్టిస్తున్నారు.






