- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాగు ఖర్చు ఆధారంగానే ‘కనీస మద్దతు ధర’.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
పంటల కనీస మద్దతు ధరను (MSP) వాస్తవ సాగు ఖర్చు ఆధారంగా నిర్ణయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని అన్నదాతలకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పంటల కనీస మద్దతు ధరను (MSP) నిర్ణయించేటప్పుడు, రాష్ట్రాలు సూచించిన వాస్తవ సాగు ఖర్చుకు (Actual cost of cultivation) తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. అయితే, ఆ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై స్పందించాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు వ్యవసాయ ధరల కమిషన్‌కు (CACP) నోటీసులు జారీ చేసింది.
అయితే, విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ (Prashant Bhushan) వాదనలు వినిపిస్తూ.. ఇది దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతుల జీవితాలతో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. పంటల సాగుకు అయ్యే ఖచ్చితమైన ఖర్చు ఆధారంగానే ఎంఎస్‌పీని నిర్ణయించాలని, అలాగే నోటిఫై చేసిన అన్ని పంటలను ప్రభుత్వమే పూర్తిస్థాయిలో సేకరించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. కనీస మద్దతు ధరకు తమ పంటను అమ్ముకోవాలనుకునే రైతులందరి నుంచి ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు లేకుండా పంటను సేకరించాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ (CACP)ను వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.






