- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Minerals Deal: ఉక్రెయిన్ అమెరికా మధ్య ఖనిజాల ఒప్పందం.. సుధీర్ఘ చర్చల తర్వాత కుదిరిన డీల్
ఉక్రెయిన్, అమెరికా మధ్య ఎట్టకేలకు ఖనిజాల ఒప్పందం కుదిరింది. సుదీర్ఘ చర్చల అనంతరం ఇరు దేశాలు డీల్‌కు అంగీకరించాయి.

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్, అమెరికా (Ukrein America) మధ్య ఎట్టకేలకు ఖనిజాల ఒప్పందం (Minerals deal) కుదిరింది. సుదీర్ఘ చర్చల అనంతరం ఇరు దేశాలు డీల్‌కు అంగీకరించాయి. ఈ మేరకు రెండు దేశాల ప్రతినిధులు వాషింగ్టన్ (Washington) లో అగ్రిమెంట్‌పై సంతకం చేసినట్టు యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ (Scott besent) తెలిపారు. ‘ఈ డీల్ ఉక్రెయిన్‌లో శాశ్వత శాంతి, శ్రేయస్సుకు ఎంతో ఉపయోగపడుతుంది. ట్రంప్ పరిపాలనా విభాగం ఉక్రెయిన్‌లో శాంతి ప్రక్రియకు అమెరికా కట్టుబడి ఉందని రష్యాకు స్పష్టంగా సూచన వెళ్తుంది’ అని తెలిపారు. ఈ అగ్రిమెంట్‌తో ఉక్రెయిన్ లోని అరుదైన ఖనిజాలను తవ్వుకోడానికి అమెరికాకు అనుమతి లభిస్తుంది. ఉక్రెయిన్‌తో అమెరికా పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. ఇరు దేశాలు కలిసి సంయుక్తంగా ఖనిజాలను వెలికి తీసి ఉపయోగించుకుంటాయి. కాగా, ఈ డీల్ గతంలోనే జరగాల్సి ఉండగా జెలెన్ స్కీ వాషింగ్టన్ పర్యటనలో ట్రంపుతో వాగ్వాదం వల్ల వాయిదా పడింది.
అగ్రిమెంట్ నేపథ్యం?
2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యాక ఉక్రెయిన్‌కు అమెరికా సుమారు 350 బిలియన్ డాలర్ల సైనిక, ఆర్థిక సాయాన్ని అందజేసింది. అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక ఈ సహాయానికి పరిహారంగా ఉక్రెయిన్ నుంచి ఖనిజాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యుద్ధంలో అమెరికా భారీగా ఖర్చు చేసిందని కాబట్టి సహజ వనరులతో పాటు అరుదైన ఖనిజాలు ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలోనే సుదీర్ఘ చర్చల అనంతరం ఒప్పందం కుదిరింది. ఉక్రెయిన్ ఖనిజ నిల్వల వల్ల అమెరికా చైనాపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయని యూఎస్ భావిస్తోంది. కాగా, ఉక్రెయిన్ లో లిథియం, టైటానియం, యురేనియం సహా వివిధ ఖనిజాలు లభిస్తాయి. వీటిని బ్యాటరీలు, సైనిక పరికరాల తయారీలో ఉపయోగిస్తారు.






