దక్షిణాది ఇస్తుంది.. ఉత్తరాది ఖర్చు చేస్తుంది: అసదుద్దీన్

by velandi.Saikiran |   (  Updated:2026-04-17 01:04:39  IST  )

దక్షిణాది రాష్ట్రాలపై నార్త్ పెత్తనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు అసదుద్దీన్ ఓవైసీ.

దక్షిణాది ఇస్తుంది.. ఉత్తరాది ఖర్చు చేస్తుంది: అసదుద్దీన్
X

దిశ‌, వెబ్ డెస్క్: డీలిమిటేషన్ బిల్లుపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లు చట్టంగా మారితే, లోక్ సభలో ప్రతిపక్షాల గొంతు మూగబోతుందని ఓవైసీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ.. తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు తక్కువ సీట్లు వస్తాయని లొసుగులు బయటపెట్టారు అసదుద్దీన్ ఓవైసీ.

దక్షిణాది రాష్ట్రాలపై నార్త్ పెత్తనం

దక్షిణాది రాష్ట్రాలపై నార్త్ పెత్తనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు అసదుద్దీన్ ఓవైసీ. దక్షిణాది నుంచి ఆదాయం వస్తుంటే... ఉత్తరాది నాయకులు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. దేశ జీడీపీలో 30% పన్ను రాబడిలో 21% దక్షిణ భారతదేశము నుంచి వస్తోందని సంచలన విషయాలు బయటపెట్టారు. సుపరిపాలన చేసినందుకు ఈ శిక్ష అని ఆగ్రహం వ్యక్తం చేశారు అసదుద్దీన్.

ఇది ఇలా ఉండగా నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి డీలిమిటేషన్ బిల్లుపై ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. దీన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక అటు బిల్లు ఆమోదం పొందడానికి కావలసిన 360 ఓట్లు కూడగ‌ట్టేందుకు అధికార ఎన్డీఏ ప్రయత్నాలు చేస్తోంది.

Next Story