- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Michelle Obama: ఒబామా దంపతుల విడాకులు.. క్లారిటీ ఇచ్చిన మిషెల్ టీం
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama) మిషెల్ దంపతులు విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama) మిషెల్ దంపతులు విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కాగా.. మిషెల్(Michelle Obama) టీమ్ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. విడాకుల వార్తలు నిరాధారమని పేర్కొంది. ట్రంప్ ప్రమాణస్వీకారానికి రావడం ఇష్టం లేకపోవడం వల్లే ఆమె ఆ కార్యక్రమానికి హాజరుకావట్లేదని వెల్లడించింది. అధ్యక్షుడి ప్రమాణస్వీకారానికి మాజీ అధ్యక్షులు, వారి భార్యలు హాజరుకావడం ఆనవాయితీ.అయితే, ఆ సంప్రదాయాన్ని మిషెల్ బ్రేక్ చేయనున్నారు. ఇకపోతే, ఇటీవల జరిగిన అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ (Jimmy Carter) అంత్యక్రియల కార్యక్రమానికి కూడా మిచెల్ హాజరుకాలేదు. వేరే చోట ఉండిపోవడం వల్లే అంత్యక్రియలు హాజరుకాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. హవాయిలోనే ఉండిపోయారని.. అందుకే రాలేకపోయారని ఆమె టీమ్ క్లారిటీ ఇచ్చింది.
ఒబామా దంపతులపై ట్రంప్ వ్యాఖ్యలు
ఒబామా దంపతులపై ట్రంప్ చేసిన "అవమానకరమైన, జాత్యహంకార వ్యాఖ్యల" వల్లే మాజీ ప్రథమ మహిళ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. మిషెల్ టీం స్పందించడంతో.. ఒబామా దంపతుల మధ్య మనస్పర్థలు ఉన్నాయని.. విడాకులు తీసుకోబోతున్నారనే ఊహాగానాలకు చెక్ పడినట్లయ్యింది. ఇకపోతే, 1992లో వివాహ బంధంతో ఒక్కటైన ఒబామా దంపతులకు సాషా, మలియా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2009లో బరాక్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కాగా తమ వైవాహిక బంధంలో చిన్న చిన్న మనస్పర్థలు ఎదురయ్యాయని, వాటిని అధిగమించేందుకు తాము కౌన్సెలింగ్ తీసుకున్నట్లు ఆ మధ్య మిచెల్ ఓ ఇంటర్వ్యూలోనూ చెప్పారు.






