Michael: పాక్ కుక్కలా పరుగెత్తుకొచ్చింది.. పెంటగాన్ మాజీ ఆఫీసర్ మైఖేల్ రూబిన్

by B.Srinivas |

భారత్ దెబ్బకు బెంబేలెత్తిన పాక్ కాల్పుల విరమణకు కుక్కలా పరుగెత్తు కొచ్చిందని పెంటగాన్ మాజీ ఆఫీసర్ మైఖేల్ రూబిన్ అన్నారు.

Michael: పాక్ కుక్కలా పరుగెత్తుకొచ్చింది.. పెంటగాన్ మాజీ ఆఫీసర్ మైఖేల్ రూబిన్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ దెబ్బకు బెంబేలెత్తిన పాక్ కాల్పుల విరమణకు కుక్కలా పరుగెత్తు కొచ్చిందని పెంటగాన్ మాజీ ఆఫీసర్ మైఖేల్ రూబిన్ (Michael Rubin) అన్నారు. ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor) తర్వాత భారత్ పాక్‌ల మధ్య జరిగిన పరిణామాలపై ఆయన గురువారం ఓ మీడియా చానెల్ తో మాట్లాడారు. భారత్ సైనిక, దౌత్య పరంగా విజయం సాధించిందని తెలిపారు. భారత్ గెలుపు ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని చెప్పారు. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రస్థావరాలపై భారత్ స్పష్టమైన దాడులు నిర్వహించిందన్నారు. భారత్ తమ వైమానిక స్థావరాలను నిలిపివేసిన తర్వాత కాళ్ళ మధ్య తోక పెట్టుకుని భయపడిన కుక్కలా పాక్ సీజ్ ఫైర్ కోసం పరిగెత్తిందన్నారు.

పాక్ దారుణంగా ఓడిపోయిందని, ఈ వాస్తవాన్ని వారు దాచలేకపోతున్నారని తెలిపారు. ఉగ్రవాదుల అంత్యక్రియలకు యూనిఫాంలో ఉన్న పాకిస్తాన్ అధికారులు హాజరు కావడం విడ్డూరంగా ఉందన్నారు. పాక్ ఆర్మీ, ఉగ్రవాది, ఐఎస్ఐ మధ్య ఎటువంటి తేడా కనిపించడం లేదన్నారు. పాక్ లోని ఉగ్ర శిభిరాను ధ్వంసం చేసే సామర్థ్యం భారత్ కు మాత్రమే ఉందన్నారు. కాగా, పహెల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. అనంతరం ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల అనంతరం కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది.

Next Story