- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెట్రో టికెట్ ధరల పెంపు.. 15 నుంచి 20 శాతం పెరిగే అవకాశం?
రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో వేసిన కమిటీ అనేక సంప్రదింపులు, ప్రజాభిప్రాయం తెలుసుకున్న మీదట 15 నుంచి 20 శాతం మేర టికెట్ల ధరలు పెంచాలని సిఫార్సు చేసింది.

- నిర్ణయించిన బీఎంఆర్‌సీఎల్
దిశ, నేషనల్ బ్యూరో:
మెట్రో టికెట్ రేట్లు మరింత ప్రియం కానున్నాయి. ఈ మేరకు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్) బోర్డు నిర్ణయం తీసుకుంది. త్వరలోనే పెంచిన ధరలను, అమలు తేదీలను ప్రకటిస్తామని మెట్రో అధికారులు తెలిపారు. 2017 తర్వాత మెట్రో టికెట్ ధరలను పెంచడం ఇదే తొలిసారి. రెండు వారాల కిందటే బెంగుళూరు సిటీ బస్సుల చార్జీలు 15 శాతం మేర పెంచారు. ఇప్పుడు మెట్రో టికెట్ ధరలు కూడా పెంచనుండటంతో ప్రయాణికులపై మరింత భారం పడనుంది. ప్రస్తుతం బెంగళూరు మెట్రోలో ప్రస్తుతం రూ.10 నుంచి రూ.60 వరకు టికెట్ రేట్లు ఉన్నాయి. స్మార్ట్ కార్డ్ ఉన్న వారికి 5 శాతం రాయితీ ఇస్తున్నారు. బీఎంఆర్‌సీఎల్ ప్రస్తుతం 77 కిలోమీటర్ల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. పర్పుల్ లైన్‌లో 43.5 కిలోమీటర్లు, గ్రీన్ లైన్‌లో 33.5 కిలోమీటర్ల రైల్వే లైన్ ఉంది. బీఎంఆర్‌సీఎల్‌కు మొదటి నుంచి ఆర్థికంగా నష్టాలు వస్తున్నాయి. గత మూడేళ్లలో రూ.1,280 కోట్ల మేర నష్టాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బెంగళూరు మెట్రోలో నిత్యం 8.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. కాగా, రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో వేసిన కమిటీ అనేక సంప్రదింపులు, ప్రజాభిప్రాయం తెలుసుకున్న మీదట 15 నుంచి 20 శాతం మేర టికెట్ల ధరలు పెంచాలని సిఫార్సు చేసింది. బెంగళూరు మెట్రో త్వరలోనే పెంపుకు సంబంధించిన ప్రకటన చేయనుంది.






