Metro: బెంగళూరు మెట్రోపై టికెట్ల ధరల పెంపు ఎఫెక్ట్

by Shamantha N |

బెంగళూరు మెట్రోపై టికెట్ల ధరల పెంపు ఎఫెక్ట్ పడింది. బెంగళూరు రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) మెట్రో టికెట్ ఛార్జీల పెంపును అమలు చేసి ఒక నెల అయ్యింది.

Metro: బెంగళూరు మెట్రోపై టికెట్ల ధరల పెంపు ఎఫెక్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: బెంగళూరు మెట్రోపై టికెట్ల ధరల పెంపు ఎఫెక్ట్ పడింది. బెంగళూరు రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) మెట్రో టికెట్ ఛార్జీల పెంపును అమలు చేసి ఒక నెల అయ్యింది. కాగా.. ఈ నెలరోజుల్లో చాలా మంది మెట్రో కాకుండా వేరే వాహనాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. కాగా.. ఈ నెల రోజుల్లో మెట్రోలో సగటున రోజుకు లక్ష టిక్కెట్లు తగ్గాయి. బీఎంఆర్సీఎల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. జనవరిలో ప్రయాణికుల సంఖ్య 2,49,14,736 కాగా.. ఫిబ్రవరిలో ఇది 2,09,90,894కి తగ్గింది. అంటే, దాదాపు 40 లక్షలు తక్కువ. కాగా.. ప్రయాణికుల సంఖఅయ తగ్గడంపై బీఎంఆర్సీఎల్ అధికారి ఒకరు స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. “ఛార్జీల పెంపునకు ముందు వీక్ డేస్ లో సగటున ప్రయాణికుల సంఖ్య 8.5 లక్షల నుండి 9 లక్షల వరకు ఉండేది. ఈ పెంపు తర్వాత ప్రయాణికుల సంఖ్య కచ్చితంగా తగ్గింది. రోజుకు సగటున 7.5 లక్షల నుండి 8 లక్షల వరకు ఉంది" అని అన్నారు.

మెట్రో ఛార్జీల పైంపు..

ఫిబ్రవరి 9న ఛార్జీల పెంపు అమలు చేశారు. కాగా.. టికెట్ల ధరలు వంద శాతం పెరిగాయి. దీంతో, ప్రయాణికులు, రాజకీయ నాయకులు కూడా ఛార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా.. అది కుదరలేదు. దీంతో, ఛార్జీల పెంపుపై ప్రజల ఆగ్రహం తర్వాత సీఎ సిద్ధరామయ్య ఫిబ్రవరి 13న అసాధారణ పెంపులను సవరించాలని మెట్రో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఛార్జీల పెంపును వందశాతానికి బదులుగా 71 శాతానికి పరిమితం చేస్తున్నట్లు మెట్రో ప్రకటించింది.

Next Story