- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chennai: చెన్నైలో తప్పిన పెను ప్రమాదం.. కూలిన మెట్రో ఫేజ్-2 నిర్మాణంలోని గిర్డర్లు
తమిళనాడు రాష్ట్రం చెన్నైలో గురువారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. చెన్నై మెట్రో రైలు ఫేజ్-II కారిడార్ కింద 3.15 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: (Chennai Metro Rail) తమిళనాడు రాష్ట్రం చెన్నైలో గురువారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. చెన్నై మెట్రో రైలు ఫేజ్-II కారిడార్ కింద 3.15 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే (phase II corridor in Manapakkam) మనపక్కంలోని ఎల్అండ్‌టీ ప్రధాన కార్యాలయ ప్రధాన ద్వారం దగ్గర వారం క్రితం నిర్మించిన రెండు ఐ-గిర్డర్లు ఊహించని విధంగా కూలిపోయాయి. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ బైకర్‌పై గిర్డర్లు పడి మృతి చెందినట్లు సమాచారం. నిర్మాణం కూలిన సమయంలో వాహనదారులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఘటనకు సంబంధించిన వివరాలను చెన్నై మెట్రో రైలు సంస్థ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
రెండు ఐ-గిర్డర్లు (I-girders) అకస్మాత్తుగా కూలిపోయాయి, దాని సహాయక A-ఫ్రేమ్‌లలో ఒకటి జారిపోయిందని సంస్థ తెలిపింది. సమాచారం అందిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన శిథిలాలను తొలగిస్తున్నామని వెల్లడించింది. కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఒక బైకర్ మృతి చెందినట్లు విచారం వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఘటనపై లోతుగా విచారణ చేపట్టినట్లు వెల్లడించింది. రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఘటన జరగడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు తాత్కాలికంగా వాహనాలను దారి మళ్లించారు. ప్రస్తుతం పునరుద్దరణ పనులు జరుగుతున్నాయి.






