- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జమ్మూకాశ్మీర్‌కు బిగ్ అలర్ట్.. వాతావరణ శాఖ కీలక ప్రకటన
జమ్మూకాశ్మీర్‌లో మరో రెండు రోజుల పాటు పలుచోట్ల హిమపాతంతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. .

దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్‌లో మరో రెండు రోజుల పాటు పలుచోట్ల హిమపాతంతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే లడఖ్‌లోని కొన్ని ప్రాంతాల్లో హిమపాతం నమోదు అయిందని, ప్రస్తుతం ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా, కుప్వారా, దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లతో పాటు శ్రీనగర్‌లోనూ వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. బుధవారం కుప్వారాలో 6.4 మి.మీ వర్షపాతం నమోదు అయిందని, జోజిలా, జాంస్కర్‌లలో హిమపాతం నమోదైందని తెలిపారు. జోజిలా-డ్రాస్, పానిఖర్-జాంస్కర్ ప్రాంతంలో ప్రస్తుతం మంచు కురుస్తోందని, లడఖ్‌లోని మిగిలిన ప్రదేశాలు మేఘావృతం అయ్యాయని, కాశ్మీర్‌లోని పలు ప్రదేశాలలో చెల్లాచెదురుగా వర్షం పడుతోందని, జమ్మూ ప్రాంతంలోనూ మేఘావృతమై ఉందని తెలిపారు.
కాశ్మీర్, లడఖ్‌లలో హిమపాతం
ఇక కాశ్మీర్, లడఖ్‌లలో మంగళవారం హిమపాతం నమోదు కావడంతో పాటు వర్షాలు కురిశాయని పేర్కొన్నారు. ఈ ఏడాది శీతాకాలం ఎక్కువగా పొడిగా ఉందని, వర్షపాతంలో 54 శాతం కంటే ఎక్కువ లోటు ఉందని తెలిపారు. గురువారం వాతావరణం తడిగా, మేఘావృతమై ఉంటుందని, శుక్రవారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఈ నెలలోనే పలమార్లు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు. ఈ నెల 19 పలు ప్రాంతాల్లో హిమపాతం ఉంటుందని తెలిపారు. రైతులు తిరిగి కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని చెప్పారు. మార్చి 15-16 మధ్య కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.






