- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మర్చంట్ షిప్పింగ్ బిల్లుకు మూజువాణీ ఓటుతో లోక్‌సభలో ఆమోదం
మర్చంట్ షిప్పింగ్ బిల్లును మూజువాణీ ఓటుతో లోక్‌సభలో ఆమోదించింది. రాజ్యసభలో సముద్ర మార్గంలో వస్తువుల రవాణా బిల్లు కూడా ఆమోదం పొందింది.

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభలో మర్చంట్ షిప్పింగ్ అమెండ్‌మెంట్ బిల్లుకు ఆమోదం లభించింది. బిహార్‌లో జరుగుతున్న ఎస్ఐఆర్‌పై విపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మూజువాణి ఓటుతో ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లు పాసైన వెంటనే విపక్షాల ఆందోళనల వల్ల లోక్‌సభ వాయిదా పడింది. మారుతున్న కాలానికి అనుగుణంగా మర్చంట్ షిప్పింగ్ యాక్ట్-1958ను సవరించినట్లు తెలుస్తోంది. ఏ దేశ జెండా లేని, చట్టపరంగా జెండా ఎగురవేయడానికి అనుమతి లేని నౌకలు ఏవైనా భారత తీరంలోకి వస్తే.. వాటిని భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి తాజా సవరణ అనుమతిస్తుంది.
రాజ్యసభలో..
అలాగే రాజ్యసభలో ‘కారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ’ (సముద్ర మార్గంలో వస్తువుల రవాణా) బిల్లుకు ఆమోదం లభించింది. భారత మారిటైం చట్టాలను ఆధునీకరించడంలో భాగంగా ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. లోక్‌సభలో గతేడాది మార్చిలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. సుమారు వందేళ్ల పాతదైన, బ్రిటిష్ కాలం నాటి ‘కారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ చట్టం-1925’ను కొత్త బిల్లు భర్తీ చేయనుంది. ఈ తాజా చట్టం.. అంతర్జాతీయ మారిటైం విధానాలకు భారత చట్టాలను అనుసంధానించనుంది.






