Meghalaya: మేఘాలయాలో రెండు నెలలపాటు నైట్ కర్ఫ్యూ

by Shamantha N |

మేఘాలయాలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో రెండు నెలలపాటు నైట్ కర్ఫ్యూ విధించారు. భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Meghalaya: మేఘాలయాలో రెండు నెలలపాటు నైట్ కర్ఫ్యూ
X

దిశ, నేషనల్ బ్యూరో: మేఘాలయాలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో రెండు నెలలపాటు నైట్ కర్ఫ్యూ విధించారు. భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జీరో లైన్ నుంచి కిలో మీటర్ రేడియస్ లో కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా మేజిస్ట్రేట్ ఆర్ ఎం కుర్పా పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. భారతీయ నాగరిక సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 163 కింద రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రతిరోజూ రాత్రి 8 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ప్యూ అమలులో ఉంటుందని వెల్లడించారు. భారతీయులెవరూ బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించకుండా, బంగ్లాదేశీయులెవరూ చట్టవిరుద్ధంగా భారతదేశంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎం తెలిపారు. ఈ ఉత్తర్వులు పనిచేస్తాయి. ఇది ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు సమూహంగా వెళ్లవద్ది సూచించారు. ఆయుధాలు, వస్తువులు, కర్రలు, రాడ్లు, రాళ్లను తీసుకెళ్లడాన్ని నిషేధించారు.

అక్రమ రవాణా అరికట్టడం..

ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుల్లోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ పశువులు, నిషిద్ధ వస్తువులు, వక్కలు, తమలపాకులు, ఎండు చేపలు, బీడీలు, సిగరెట్లు, టీ ఆకుల అక్రమ రవాణాను అరికట్టడం ఈ ఆదేశాల ముఖ్య ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్ 22న పహెల్గామ్ లో ఉగ్రవాదులు టూరిస్టులపై కాల్పులు జరిపారు. దీంతో 26 మంది చనిపోయారు. ఈ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. అయితే, అప్పట్నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని బంగ్లాదేశ్ పేర్కొంది. అయితే, బంగ్లా ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా వైదొలిగిన తర్వాత న్యూఢిల్లీ- ఢాకా మధ్య విబేధాలు తలెత్తాయి. అప్పట్నుంచి భారత్- బంగ్లా మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

Next Story