- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాని మోడీ నివాసంలో ముగిసిన సమావేశం.. కీలక అంశాలపై చర్చ
భారత్ -పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఏర్పాటు చేసిన కీలక సమావేశం ముగిసింది.

దిశ, వెబ్ డెస్క్: భారత్ -పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) నివాసంలో ఏర్పాటు చేసిన కీలక సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ (Union Minister Rajnath Singh), జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (NSA Ajit Doval), సీడీఎస్ అనిల్ చౌహాన్ (CDS Anil Chouhan) సహా తివిధ దళాల అధిపతులు హజరయ్యారు. భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్ దాడులు చేయడం, భారత భద్రతా దళాలు వాటిని ధీటుగా ఎదుర్కోవడం సహా తాజా పరిణామాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. అలాగే పాక్ కవ్వింపు చర్యలకు భారత్ తీసుకోవాల్సిన చర్యలతో పాటు పాక్ ఎదురుదాడులను తిప్పికొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చ జరిగిందని తెలుస్తోంది. కాగా శుక్రవారం సాయంత్రం పాకిస్థాన్ భారత్ సరిహద్దుల్లో తిరిగి డ్రోన్ దాడులు చేయడం ప్రారంభించింది. ముందుగానే గ్రహించిన భారత ఆర్మీ పాక్ డ్రోన్లు గాలిలో ఉండగానే పేల్చివేస్తోంది.
READ MORE ...
War Begin: వార్ సైరన్ మోగించిన భారత సైన్యం!






