- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trainy Doctor Murder Case : సీల్దా కోర్టు ఎదుట మెడికోస్ ఆందోళన
కోల్‌కతా(Kolkata) ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు(Trainy Doctor Murder Case)లో దోషి సంజయ్ రాయ్(Sanjay Roy) కి కోల్‌కతా సీల్దా కోర్ట్(Seelda Court) జీవితకాల శిక్ష(Life Time Sentence) విధించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : కోల్‌కతా(Kolkata) ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు(Trainy Doctor Murder Case)లో దోషి సంజయ్ రాయ్(Sanjay Roy) కి కోల్‌కతా సీల్దా కోర్ట్(Seelda Court) జీవితకాల శిక్ష(Life Time Sentence) విధించిన విషయం తెలిసిందే. కోర్ట్ తీర్పుపై ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ(RG Kar Medical College) విద్యార్థులు కోర్ట్ ఎదుట నిరసనకు దిగారు. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, కోర్ట్ తీర్పుపై హైకోర్ట్ లో అప్పీలు చేస్తామని తెలిపారు. నిదితుడికి ఉరిశిక్ష పడే వరకు ఊరుకోబోమని స్పష్టం చేశారు. కాగా గత ఆగస్టులో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ను అరెస్ట్ చేయగా.. సీబీఐ విచారణ చేపట్టింది. నేడు సంజయ్ రాయ్ కి యావజ్జీవ శిక్ష విధించింది. నిందితుడికి ఈ శిక్ష సరిపోదని, ఉరిశిక్షనే సరైనదని వైద్య విద్యార్థులు ధర్నాకు దిగారు. కాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ శిక్షపై అసంతృప్తి వ్యక్తం చేసారు. నిందితుడికి ఉరిశిక్ష వేయాల్సింది అని అభిప్రాయపడ్డారు.






