- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ నెల 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్
ఆన్ లైన్‌లో మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ దేశంలోని మెడికల్ షాపుల యజమానులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 20న ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ మెడికల్ షాపుల బంద్‌కు పిలుపునిచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: ఆన్ లైన్‌లో మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ దేశంలోని మెడికల్ షాపుల యజమానులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 20న ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ మెడికల్ షాపుల బంద్‌కు పిలుపునిచ్చింది. కోవిడ్ సమయంలో కేంద్రం ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని ఆర్గనైజేషన్ డిమాండ్ చేస్తోంది. ఆన్ లైన్ లో ప్రమాదకర, నకలీ మందుల సరఫరా చేస్తున్నారని ఆరోపణలు చేసింది. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఆన్ లైన్ లో మందులు సరఫరా చేయడానికి చెక్ పెట్టాలని డిమాండ్ చేసింది. మెడికల్ షాపుల ఆర్గనైజేషన్ తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న 12.40 లక్షలకు పైగా మెడికల్ షాపులు మూతపడే అవకాశం ఉంది. మెడికల్ షాపులు మూతపడితే ఆస్పత్రుల్లో అత్యవసర మందులు దొరక్క పేషెంట్లు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇతర వ్యాధులతో ఇబ్బందిపడేవాళ్లు సైతం తమ మందులు పూర్తయ్యేలా ఉంటే ముందుగా కొనుగులు చేసి పెట్టుకోవడం మంచింది.






