మాంసం, మాంసపు పదార్థాల విక్రయాలపై నిషేధం.. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 17 వరకు అమలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-01-18 13:13:08  IST  )

యలహంకలోని ఎయిర్‌పోర్స్ స్టేషన్‌లో ఏరో ఇండియా-2025ను ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు.

మాంసం, మాంసపు పదార్థాల విక్రయాలపై నిషేధం.. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 17 వరకు అమలు
X

- ఏరో ఇండియా షో నేపథ్యంలో నిర్ణయం

- ఉత్తర్వులు జారీ చేసిన బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్

దిశ, నేషనల్ బ్యూరో:

15వ ఏరో ఇండియా షోను బెంగళూరు ఇవారు యలహంకలో ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 14 వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి 13 కిలోమీటర్ల పరిధిలో మాంసం, మాంసపు పదార్థాల విక్రయాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అన్ని రకాల మాంసపు దుకాణాలు, నాన్‌వెజ్ హోటల్స్, రెస్టారెంట్లు మూసేయాలని బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. నాన్ వెజ్ పదార్థాల కారణంగా వెలువడే చెత్త కోసం పక్షలు ఆ ప్రదేశంలో వాలుతాయని.. దీని వల్ల గాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో పతంగులు ఎగురవేయడంపై కూడా నిషేధాజ్ఞలు ఉంటాయని పేర్కొన్నారు.

యలహంకలోని ఎయిర్‌పోర్స్ స్టేషన్‌లో ఏరో ఇండియా-2025ను ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. అయితే దానికి ముందు పైలట్ల రిహార్సల్స్ కూడా ఉంటాయి. పక్షులు భారీగా ఎగరడం వల్ల విమానాలకు ఢీ కొని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే మాంసం కొట్లు, నాన్ వెజ్ హోటల్స్, రెస్టారెంట్లు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. మాంసం, చికెన్, ఫిష్‌తో పాటు ఇతర నాన్ వెజ్ సంబంధిత విక్రయాలన్నీ నిలిపేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు 13 కిలోమీటర్ల పరిధిలో ఎవరైనా ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే.. వారికి బీబీఎంపీ యాక్ట్-2020, రూల్ 91, ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ 1937 ప్రకారం కఠిన శిక్షలు విధించబడతాయని తెలిపారు.

కాగా, ఈ సారి జరగబోయే ఏరో ఇండియా షోలో డిఫెన్స్ మినిస్టర్ల కాంక్లేవ్, సీఈవోల రౌండ్ టేబుల్ సమావేశంతో పాటు భారీ ఎగ్జిబిషన్ కూడా నిర్వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఏరో స్పేస్ కంపెనీలు ఇక్కడకు తరలి రానున్నాయి. ఈ రంగంలో ఉన్న వారికి సరికొత్త అవకాశాలు, వ్యాపార విస్తరణ కోసం ఈ ఏరో ఇండియా ఉపయోగపడనున్నది.

Next Story