అయోధ్యలో మద్యం, మాంసంపై నిషేదం

by Ajay Maddhiboyina |

ప్రముఖ పుణ్యక్షేత్రం రామాలయం నిర్మించిన అయోధ్యలో మాంసం, మద్యాన్ని నిషేదించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పవిత్రమైన అయోధ్యలో మద్యం, మాంసం అమ్ముతున్నారు

అయోధ్యలో మద్యం, మాంసంపై నిషేదం
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం రామాలయం నిర్మించిన అయోధ్యలో మాంసం, మద్యాన్ని నిషేదించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పవిత్రమైన అయోధ్యలో మద్యం, మాంసం అమ్ముతున్నారు అంటూ భక్తుల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు అలర్ట్ అయ్యారు. రామ్ పథ్ నుండి 14 కిలోమీట‌ర్ల వ‌ర‌కు, కోసి మార్గ్ లాంటి పలు రహదారుల వెంట మాసం, మద్యం అమ్మకాలపై పూర్తిగా నిషేదం విధించాలని నిర్ణయం తీసుకున్నారు. మాసం దుకాణాలను వేరే చోటుకు మార్చాలని ఇప్పటికే దుకాణ యజమానులను ఆదేశించారు. పలు ప్రాంతాల్లో మద్యం కూడా నిషేదిస్తామని మేయర్ త్రిపాఠి వెల్లడించారు. నిజానికి ఈ ప్రాంతాల్లో మ‌ద్యం, మాసం అమ్మ‌కాల‌ను నిషేదించాల‌ని గ‌త నెల అధికారులు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. వీటితో పాటూ పాన్, గుట్కా ఇతర మ‌త్తు ప‌దార్థాల‌ను సైతం నిషేదించారు. మ‌రోవైపు అయోధ్య ప్ర‌ధాన న‌గ‌రంలో ద‌శాబ్దాల కాలం నుండే మ‌ద్య నిషేదం అమ‌లులో ఉంది.

Next Story