MDR Ramachandran: పుదుచ్చేరి మాజీ సీఎం ఎండీఆర్ రామచంద్రన్ కన్నుమూత

by Kema Shiva Kumar |

పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి ఎండీఆర్‌ రామచంద్రన్‌ (MDR Ramachandran) (92) కన్నుమూశారు.

MDR Ramachandran: పుదుచ్చేరి మాజీ సీఎం ఎండీఆర్ రామచంద్రన్ కన్నుమూత
X

దిశ, వెబ్‌డస్క్: పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి ఎండీఆర్‌ రామచంద్రన్‌ (MDR Ramachandran) (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారం, తీవ్ర అనారోగ్య సమస్యలతో చెన్నై (Chennai)లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు మూడు రోజుల పాటుగా కేంద్ర పాలిత ప్రాంతం పుదు‌చ్చేరి (Puducherry)లో మూడు రోజుల పాటు సంతాప దినాలుగా పాటించాలని సీఎం రంగస్వామి (CM Ranga Swamy) ఆదేశించారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో స్వగ్రామం పుదుచ్చేరి(Puducherry) మదుకరై (Madukarai)లో జరగనున్నాయి. ఆయన మృతి పట్ల లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కైలాసనాథన్‌ (Kailasanathan), తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin), తదితరులు సంతాపం తెలిపారు.

ఎండీఆర్ రామచంద్రన్ (MDR Ramachandran) 1934 జనవరి 31న జన్మించారు. అనంతరం 1969లో నొట్టపాక్కం (Nottapakkam) నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. అదేవిధంగా పన్నాడి‌కుప్పం (Pannadikuppam) నియోజకర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. ఇక 1980 నుంచి 1983 వరకు తొలిసారి పుద్దుచ్చేరి (Puducherry) సీఎంగా పని చేశారు. 1990 నుంచి1991 రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా పని చేశారు. అనంతరం 2001లో ఏడీఎంకే‌ (ADMK)లో చేరి స్పీకర్‌గా విధులు నిర్వర్తించారు. చనిపోయే ముందు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ (Congress) ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

Next Story