- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mayavathi : మేనల్లున్ని క్షమించిన మాయావతి.. పార్టీలోకి రీ ఎంట్రీ
బీఎస్పీ(BSP) అధినేత్రి మాయావతి(Mayavathi) తన మేనల్లున్ని క్షమించింది.

దిశ, వెబ్ డెస్క్ : బీఎస్పీ(BSP) అధినేత్రి మాయావతి(Mayavathi) తన మేనల్లున్ని క్షమించింది. మాయావతి మేనల్లుడు ఆకాశ్ ఆనంద్(Akash Anand) పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆయనను కొద్దిరోజుల క్రితం పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. ఇన్నిరోజులు సైలెంట్ గా ఉన్న ఆకాశ్ నేడు తన తప్పులను బహిరంగంగా ఒప్పుకొని క్షమించమని కోరాడు. చేసిన తప్పులను ఒప్పుకుంటూ క్షమాపణలు చెప్పడంతో మాయావతి దిగివచ్చింది. మేనల్లునికి మరో అవకాశం ఇచ్చేందుకు సిద్ధం కాగా.. ఆకాశ్ మరోసారి పార్టీలోకి రీ ఎంట్రీ(Akash Re Entry) ఇచ్చాడు. అయితే రెండు రోజుల క్రితమే తన వారసులుగా ఇంకా ఎవరినీ నిర్ణయించలేదని మాయావతి ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. కాగా ఆకాశ్ మరోసారి పార్టీలోకి రావడాన్ని కొందరు సీనియర్ నేతలు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నట్టు స్థానిక మీడియా కథనాలు ప్రసారం చేసినట్టు సమాచారం.






