- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mahakumbh: బుధవారం మౌని అమావాస్య.. షాహి స్నానాలకు భక్తులు పోటెత్తే అవకాశం..!
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహా కుంభమేళా (Kumbh Mela 2025)కు భక్తులు పోటెత్తుతున్నరు. కాగా.. ఇప్పటికే 15 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహా కుంభమేళా (Kumbh Mela 2025)కు భక్తులు పోటెత్తుతున్నరు. కాగా.. ఇప్పటికే 15 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్క సంక్రాంతిరోజే మూడున్నర కోట్ల మంది కుంభమేళాకు వచ్చినట్లు పేర్కొన్నారు. అత్యంత పవిత్రరోజుగా భావించే మౌని అమావాస్య (Mauni Amavasya) రోజున కుంభమేళాకు భక్తుల తాకిడి పెరగనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. సుమారు 10కోట్ల మంది షాహి స్నానాల కోసం రానున్నట్లు అంచనా వేస్తున్నారు. దీనికోసం అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. భద్రతా నియమాలు పాటిస్తూ.. అధికారులకు సహకరించాలని కోరారు. ఈ మేరకు అడ్వైజరీ జారీ చేశారు. పోలీసులు, ట్రాఫిక్ అధికారులు, వైద్యులతో సహా ప్రత్యేక బృందాలన్నీ అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించడానికి 24 గంటలూ విధుల్లో ఉంటారని మహాకుంభ్ నగర్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ ద్వివేది వెల్లడించారు.
సూచనలివే..
కుంభమేళాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రజల సహకారం ముఖ్యమని అధికారులు చెప్పుకొచ్చారు. నిర్దేశించిన మార్గాల్లోనే ఘాట్‌లకు వెళ్లాలని.. స్నానాల తర్వాత అక్కడ ఎక్కువ సేపు ఉండవద్దని సూచించారు. పార్కింగ్ ప్రదేశాలు లేదా బస చేసే ప్రాంతాలకు భక్తులు తిరిగి చేరుకోవాలని ఆదేశించారు. బారికేడ్లు వద్ద, బ్రిడ్జిలపై నిదానంగా వెళ్లాలన్నారు. తొందరపాటు చర్యలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. అస్వస్థతకు గురైన వెంటనే ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సెక్టార్ ఆసుపత్రులకు వెళ్లలన్నారు. సంగమం వద్ద ఉన్న అన్ని ఘాట్‌లు పవిత్రమైనవే అని.. తొలుత ఎక్కడికి చేరుకుంటే అక్కడే స్నానాలు చేయడం ఉత్తమమని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే రూమర్లను పట్టించుకోవద్దన్నారు. మౌలిక సదుపాయాలు, కుంభమేళా ఏర్పాట్ల గురించి చేసే అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు. రోడ్లమీద గుంపులుగా నిల్చోవద్దని.. భక్తులు రద్దీ నియంత్రణ నిబంధనలు పాటిస్తూ.. పోలీసులకు సహకరించాలని సూచించారు. బుధవారం మౌని అమావాస్య రానుంది. అయితే, ఆరోజు గంగానది జలాలు ప్రత్యేకించి త్రివేణి సంగమంలోని జలాలు అమృతంతో సమానం అని భక్తులు విశ్వసిస్తారు. ఈ సమయంలో పుణ్యస్నానం చేస్తే ఎన్నో జన్మల పుణ్యం వస్తుందని నమ్ముతారు.






