ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. అర్ధరాత్రి భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు

by Malleboina Mahesh |

తమిళనాడు ప్రభుత్వం అర్ధరాత్రి వేళ భారీ పరిపాలనా కసరత్తును చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ హోదాల్లో ఉన్న 70 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. అర్ధరాత్రి భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu Govt) అర్ధరాత్రి వేళ భారీ పరిపాలనా కసరత్తును చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ హోదాల్లో ఉన్న 70 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (Election Schedule) వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో, పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ బదిలీలు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇందులో డీఐజీ (DIG) స్థాయి నుంచి డీజీపీ (DGP) హోదా వరకు ఉన్న సీనియర్ అధికారులు కూడా ఉండటం గమనార్హం.

ఈ బదిలీల్లో పలువురు అధికారులకు పదోన్నతులు (promotions) కూడా కల్పించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శాంతిభద్రతల పరిరక్షణ (Maintenance of law and order), ఎన్నికల నిర్వహణలో అనుభవం ఉన్న అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ (Election Schedule) వెలువడక ముందే రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో ఈ స్థాయి మార్పులు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో డీఎంకే ప్రభుత్వం (DMK Govt) తమకు అనుగుణంగా ఉన్న పోలీసు అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించారని, ఎన్నికల్లో ప్రభావం చూపేందుకే ఈ నిర్ణయం తీసుకొని అర్ధరాత్రి బదిలీలు చేశారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

Next Story