vote chori: త్వరలో రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు! ఓటు చోరీ ఇష్యూలో బీజేపీ రివర్స్ ఇన్వెస్టిగేషన్

by Prasad Jukanti |   (  Updated:2025-08-14 12:35:22  IST  )

రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేయాలని బీజేపీ ఈసీని కలవబోతున్నట్లు ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

vote chori: త్వరలో రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు! ఓటు చోరీ ఇష్యూలో బీజేపీ రివర్స్ ఇన్వెస్టిగేషన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజకీయాల్లో ఓటు చోరీపై హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. బీజేపీతో కలిసి ఎన్నికల కమిషన్ ఓటు చోరీకు (Vote Chori) పాల్పడుతోందని లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోపణలు ఒక్క సారిగా అలజడి రేపగా ఈ ఆరోపణలకు కట్టుబడి డిక్లరేషన్ ఇస్తారా అంటూ ఈసీ కౌంటర్ ఇస్తోంది. రాహుల్ వర్సెస్ ఈసీ మధ్య బిగ్ ఫైట్ నడుస్తున్న ఈ క్రమంలో తాజాగా బీజేపీ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఓటర్ లిస్టుపై రాహుల్ గాంధీ మాత్రమే కాదు మేమూ ఎంక్వైయిరీ చేశామని ఇందులో రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం రాయబరేలీలోనే 2 లక్షల ఓట్ల అవకతవకలు జరిగాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ విషయంలో తాము రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం రద్దు చేయాలని ఈసీని కోరబోతున్నామని హాట్ కామెంట్స్ చేశారు. ఓట్ల చోరీ అంశం దేశ రాజకీయాలను ఓ కుదుపు కుదుపున్న వేళ రాహుల్ ప్రాతినిథ్యం రద్దు కోసం తాము ప్రయత్నిస్తామని బీజేపీ ఎంపీ చెప్పడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

బీజేపీ డోర్ టు రోడ్ ఎంక్వైరీ:

ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఓటు చోరీ పంచాయతీ మొదలయ్యాక రాయబరేలీతో పాటు ప్రతిపక్ష పార్టీలు గెలిచిన కొన్ని స్థానాల్లో మా కార్యకర్తలను డోర్ టు డోర్ పంపి ఎంక్వయిరీ చేశామన్నారు. మా సర్వేలో రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయబరేలీ ఓటర్ లిస్ట్ లోని 2 లక్షల ఓట్లుపై అనుమానాలు కలిగాయన్నారు. ఇక్కడ 71,977 ఓటర్లు ఫేక్ అడ్రస్ తో ఉన్నారని, లోక్ సభ ఎన్నికలకు ముందు 92,747 మంది బల్క్ గా కొత్తగా ఓటర్లు చేరారన్నారు. 52 వేల ఫేక్ బర్త్ సర్టిఫికెట్ తో ఓటర్లు నమోదు అయినట్లు గుర్తించామన్నారు. ఇక ప్రియాంక గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న వాయనాడ్ లోక్ సభ నియోజకవర్గం ఓటర్ జాబితాపై కూడా మాకు అనుమానాలు ఉన్నాయన్నారు. ఇక్కడ 93,499 మంది ఒక వర్గం వారు ఓటర్లు వేశారన్నారు. బెంగాల్ లో మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రాతినిథ్యం వహిస్తున్న డైమండ్ అర్బర్, అఖిలేశ్ యాదవ్ తో పాటు ఆయన సతీమణి డింపుల్ యాదవ్ ప్రాతినిథ్యం వహించిన ఓటర్ జాబితాపై మాకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు. ఆన్ రికార్డుగా బీజేపీ ఎంపీగా ఈ వ్యాఖ్యలు నేను చేస్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ దమ్ముంటే రాజీనామా చెయ్:

ఈ దేశంలోని ఏ వ్యవస్థల పట్ల కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నాయకుడు లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి నమ్మకం లేకపోవడం దురదృష్టకరం అని రఘునందన్ రావు మండిపడ్డారు. ఈ దేశంలో బ్యాలెట్ పేపర్ల వద్దని ఈవీఎంలను తీసుకురావాలని మొట్టమొదటిసారిగా ప్రతిపాదన చేసిందే రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ అని అన్నారు. తండ్రి బ్యాలెట్ ను తప్పుపడితే కొడుకు ఈవీఎంలను తప్పుబడుతున్నారని వీళ్లను చూశాక కాంగ్రెస్ కరాబ్ అయిందని ప్రజలు అనుకుంటున్నారని సెటైర్ వేశారు. ఇది అర్థం చేసుకోవడానికి రాహుల్ గాంధీకి మరికొంత సమయం పడుతుందన్నారు. ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీకి దమ్ముంటేఎంపీ పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. బ్యాలెట్ పేపర్లతో బై ఎలక్షన్స్ కు రావాలన్నారు. బ్యాలెట్ పేపర్లకు, ఈవీఎంల విషయంలో ఒక్కసారైనా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ శాస్త్రీయమైన అధ్యయనం చేశారా అని నిలదీశారు. బీజేపీ కూడా మొదట్లో ఈవీఎంలో వ్యతిరేకించిందని కానీ మా పార్టీ సైంటిఫిక్ స్టడీ చేసిన తర్వాత ఈవీఎంలను స్వాగతించిందని చెప్పారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన రోహింగ్యాల ఓటు హక్కులను రద్దు చేస్తారనే భయంతోనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. బిహర్ లో ఓటమిని ముందే పసిగట్టి ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా కాంగ్రెస్ ఇప్పటి నుంచే ఏడ్పు మొదలు పెట్టిందన్నారు. దొంగ ఓట్లను అరికట్టేందుకే ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ ను తీసుకువచ్చిందన్నరు. నరేంద్ర మోడీ నేతృత్వంలో భారత దేశం ప్రపంచస్థాయిలో శక్తివంతంగా మారుతుంటే ఓర్వలేక విదేశీ శక్తులతో కలిసి కొంత మంది చేస్తున్న కుట్రలో భాగమే ఇదంతా అన్నారు. డీప్ స్టేట్ పేరుతో ఈ కుట్ర జరుగుతోందన్నారు. సొరెన్ అనే దళారితో డబ్బులతో ఈ దేశంలోని మీడియాను, సంస్థలను ఎజెన్సీలను వాడుకుని ఈ దేశ ప్రతిష్టను దెబ్బతీయాలనే కుట్రలో రాహుల్ గాంధీ పావుగా మారారని ఆరోపించారు.

Next Story